NTV Telugu Site icon

Pawan Kalyan: బీజేపీతోనే ఉన్నా.. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా

Pavan

Pavan

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళం విప్పారు. ప్రస్తుతం తాను బీజేపీతో ఇప్పుడు కలిసే ఉన్నానని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా ముందుకెళ్తామన్నారు. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తులపై మాట్లాడొచ్చని, కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిన నేల.. తెలంగాణలో తన పాత్ర పరిమితమేనన్నారు. తన రాజకీయ ప్రస్థానం తెలంగాణ నేలపైనే మొదలు పెట్టానని పవన్ స్పష్టం చేశారు.

Read Also: Car Romance: కామా తురాణం.. కదులుతున్న కారులోనే రొమాన్స్

కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామని, లేకపోతే ఒంటరి పోరుకు కూడా సై అని పవన్ చెప్పారు. ఓట్లు చీలనివ్వనని మరోసారి పేర్కొన్నారు. అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పొటీ చేయాలనేది తన అభిమతమని పవన్ చెప్పుకొచ్చారు. బీజేపీ కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తానని, కలిసి రాకపోతే వేరే పార్టీల వైపు చూడాల్సి వస్తుందన్నారు. పొత్తులపై ఎన్నికలకు వారం రోజుల ముందు క్లారిటీ వస్తుందన్నారు. 2014 కాంబినేషన్‌పై కాలమే నిర్ణయిస్తుందని పవన్ చెప్పారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఎవరైనా తమతో పొత్తు పెట్టుకునేందుకు ముందుకు రావొచ్చనే సంకేతాలను పవన్ స్పష్టంగా ఇచ్చారు. ఇప్పటికే టీడీపీతో పవన్ పొత్తు ఖాయమైందనే ప్రచారం క్రమంలో.. పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Read Also: Komatireddy Venkat Reddy : మీకు చదవాలని కోరిక ఉందా.. నేను చదివిస్తా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు వేర్వేరని రెండింటినీ పోల్చి చూడలేమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలన్న యోచనలో ఉన్నట్లు ప్రకటించారు.

Show comments