NTV Telugu Site icon

RGV: పవన్ గుండెలపై రామ్ గోపాల్ వర్మ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

New Project (13)

New Project (13)

RGV: రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. ఏ పని చేసినా అందులో క్రియేటివిటీ ఉండేలా చూసుకుంటారు. తన మార్క్ చూపించడానికి మాగ్జిమన్ ప్రయత్నిస్తుంటారు. ఇక ఆయన ఆలోచనలు.. అభిరుచులు.. చాల డిఫరెంట్ గా ఉంటాయి. మరో వ్యక్తి ఆలోచనలకు కూడా అందనంతగా తన క్రియేటివిటీ ఉంటుంది. ఇది ఆయన సినిమాలలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా చేసిన ఓ పోస్ట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌పై ఆర్జీవీ తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల వారాహి యాత్ర సందర్భంగా పవన్ వలంటీర్‌పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టించాయి. ఇక తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసి మరో వివాదానికి తెరలేపారు. పవన్ కళ్యాణ్ ఎరుపు రంగు కండువా కప్పుకున్న ఫొటోను ఎడిట్ చేసి, అతను కప్పుకున్న కండువా‌పై శివుని ఫొటోలాగా వర్మ ఫోటో ఎడిట్ చేసి షేర్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Read Also:Zaheer Khan-Virat Kohli: నా కెరీర్‌ను ముగించావ్ అని కోహ్లీతో అనలేదు: హీర్‌ ఖాన్‌

రీసెంట్ గా హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్న తన కొత్త ఆఫీసు కూడా తన క్రియేటివిటీకి అద్దం పట్టేలా నిర్మించుకున్నాడు. వర్మ తన కొత్త ఆఫీస్ లోని ప్రతి గదిని చూపిస్తూ ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించాడు. ఒక పాటపై ఆ విజువల్స్ ను కట్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. వర్మ తన కొత్త ఆఫీసుకు ‘ఆర్జీవీ డెన్’ అనే పేరు పెట్టాడు. లోపల తిరుగుతుంటే.. అడవిలోని గుహల్లో తిరుగుతున్న అనుభూతి కలిగేలా డిజైన్ చేయించాడు. తాను ప్రముఖులతో దిగిన ఫోటోలు .. బోల్డ్ హీరోయిన్స్ పోస్టర్స్ .. సిట్టింగ్ ఏరియాలు .. ఇలా ఆ డెన్ లో చాలానే కనిపిస్తాయి. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “వ్యూహం” అనే రాజకీయ సినిమా తీస్తున్నారు. అనంతరం ఆయన తన కొత్త సినిమాను ప్రకటించాడు వర్మ. ఈ సినిమాను 2 భాగాలుగా తీయబోతున్నాడు. మొదటి భాగానికి వ్యూహం, రెండో భాగానికి శపథం అనే టైటిల్స్ పెట్టాడు. ఈ రెండు భాగాల్లో రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయని టాక్.

Read Also:Gouri G. Kishan : బికినీ అందాలతో రెచ్చగొడుతున్న జాను బ్యూటీ..

Show comments