NTV Telugu Site icon

JSP LP leader Pawan kalyan: జనసేన ఎల్పీ లీడర్గా పవన్ ఏకగ్రీవం..

Janasena

Janasena

మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎల్పీ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. ఆ తర్వాత శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన కొణిదెల పవన్ కళ్యాణ్‌ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు.

Read Also: RT75 Launched: ధమాకా జోడి రిపీట్.. రవితేజ, శ్రీలీల కొత్త సినిమా ఆరంభం!

ఇక, కాసేపట్లో ఎన్డీయే కూటమిలో టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఏపీ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించనున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు (జూన్ 12వ) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఏ మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ కూటమి నేతల్లో కొనసాగుతుంది.