Pawan Kalyan visits Rushikonda Palace: విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను పరిశీలించారు.. జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను తిలకించారు పవన్.. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది” అంటారు.. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే రుషికొండపై 1 కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Ravi Mohan : రవిమోహన్ నిర్మాణంలో తొలి సినిమా టైటిల్ ప్రోమో రిలీజ్
రుషికొండ టూరిజం భవనాలు పరిశీలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. అత్యధునిక బెడ్ రూమ్స్, బాత్ రూమ్స్ చూసి ఆశ్చర్యపోయారు పవన్ కల్యాణ్.. అవన్ని పాడైపోతున్నాయి.. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.. గతంలో హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఏడు కోట్లు ఆదాయం వచ్చేదని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించారు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్.. కానీ, ఇప్పుడు మెంటినెన్స్ కు కోటి రూపాయలు బకాయి పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, గ్రీన్ ట్రిబ్యునల్‌లో సైతం కేసు నడుస్తుందని వివరించారు అధికారులు.. అయితే, రుషికొండ భవనాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలన్నారు పవన్ కల్యాణ్.. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించేందుకు ప్రయత్నించారు పవన్ కల్యాణ్.. దీంతో, ఆయన్ని అడ్డుకున్నారు పోలీసులు.. రుషికొండపై ప్యాలెస్‌తో పర్యావరణాన్ని దెబ్బతిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. కాగా, రాషికొండ ప్యాలెస్ బడ్జెట్, అందులో వాడిన అత్యాధునిక టెక్నాలజీ, బెడ్‌రూమ్స్, బాత్‌రూమ్స్ పై పెద్ద వివాదం నడిచిన విషయం విదితమే.. ఇక, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మరోసారి రిషికొండ ప్యాలెస్‌ను పవన్ కల్యాణ్ పరిశీలించిన విషయం విదితమే..
