NTV Telugu Site icon

Pawan Kalyan Varahi Ammavari Deeksha: డిప్యూటీ సీఎం వారాహి అమ్మవారి దీక్ష.. 11 రోజులు పాలు, పండ్లతోనే..

Pawan

Pawan

Pawan Kalyan Varahi Ammavari Deeksha: జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌.. వారాహి అమ్మవారి దీక్షకు సిద్ధం అవుతున్నారు.. ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్షను పవన్‌ కల్యాణ్‌ చేపట్టనున్నారంటూ జనసేన ప్రకటించింది.. ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు జనసేనాని.. ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. అయితే, గత ఏడాది జూన్ మాసంలో వారాహి విజయ యాత్ర చేపట్టారు పవన్‌ కల్యాణ్‌.. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు..

Read Also: South Korea: సౌత్ కొరియా బ్యాటరీల ఫ్యాక్టరీలో ప్రమాదం.. 20 మంది మృతి

ఇక, వారాహి విజయ యాత్ర విజయవంతం కావడమే కాదు.. ఆ యాత్ర సంకల్పం కూడా నెరవేరింది.. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్.. అదే తరహాలో.. టీడీపీ-జనసేన-బీజేపీ ఒకే తాటిపైకి రావడానికి కీలకంగా పనిచేశారు. ఇక, కూటమి గెలుపుకోసం ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు.. కూటమి విజయంలో వారాహి విజయ యాత్ర కీలక భూమిక పోషించిందని చెబుతారు.. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోవడం.. జనసేన పోటీ చేసిన (21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌) అన్ని స్థానాల్లో విజయ కేతనం ఎగరవేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్‌ జోషల్‌లో ఉన్నారు.. ఇదంతా వారాహి అమ్మవారి వల్లే సాధ్యమైందని నమ్ముతున్నారు.. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 11 రోజుల పాటు దీక్ష చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.