Hari Hara Veeramallu : పవన్ కల్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతిన్న ఈ సినిమా అనేక కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ దీనిపై దృష్టి పెట్టారన సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైంది.
Read Also: The Test : మొదటిసారి.. మాధవన్, నయనతార ‘ది టెస్ట్’
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో ఒక పాట పాడించాలని అనుకుంటున్నాడట క్రిష్. గతంలో కూడా పలు సినిమాలో పాటలు పాడిన అనుభవం పవన్ కు ఉంది. అవి సక్సెస్ కావడంతో క్రిష్ మళ్లీ పవన్ ను ఓ పాటకు సింగర్ చేయాలనుకుంటున్నాడట. ఆ పాటను పవన్ పాడితేనే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించాడని టాక్. సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న కీరవాణి కూడా పవన్ కి తగినట్టుగా ట్యూన్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ పాట సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో వస్తుందంట. ఈ పాటను రికార్డు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. గతంలో పవన్ ‘తమ్ముడు’ .. ‘ గుడుంబా శంకర్’ .. ‘జానీ’ .. ‘అత్తారింటికి దారేది’ .. ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో పలు పాటలు పాడారు. ఆ సినిమాలకి ప్రత్యేకమైన ఆకర్షణగా అవి నిలిచాయి. అలాగే ‘వీరమల్లు’ సినిమాలోని పవన్ పాట కూడా ఒక రేంజ్ లో పాప్యులర్ అవుతుందని భావిస్తున్నారు.
Read Also: Yash 19 : ఆ హీరోయిన్ దర్శకత్వంలో నటించనున్న యష్ ?