NTV Telugu Site icon

Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్‌ల సమస్యలపై ఆరా!

Pawan Kalyan Auto

Pawan Kalyan Auto

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆటోలో ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో పర్యటించారు. రోడ్డు షోలో భాగంగా కొండెవరం వద్ద ఆటోలో పవన్ రెండు కిలోమీటర్లు ప్రయాణించారు. అధ్వాన్నపు రహదారుల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలని జనసేనానిని డ్రైవర్‌లు కోరారు.

Also Read: Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్‌ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..!

ప్రతి ఒక్కరి ఇబ్బందిని తాను తెలుసుకుంటానని, మీలో ఒకడిగా ఉంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కారం చూపుతానని పవన్‌ కళ్యాణ్‌ ఆటో డ్రైవర్‌లకు భరోసా ఇచ్చారు. ‘నేను మీ పవన్‌ కల్యాణ్‌.. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నా. మీరందరూ ఓటేసి నన్ను గెలిపించండి’ అని పవన్‌ ప్రజలను కోరారు. జనసేనానితో కరచాలనానికి, ఫొటోలు తీసుకోడానికి జనం పోటీపడ్డారు. అందరితో పవన్ ఎంతో ఓపికగా మాట్లాడారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Show comments