విజయనగరం పర్యటనలో భాగంగా గుంకలాం జగనన్న కాలనీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అపూర్వ స్వాగతం లభించింది. .కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. దారిపొడవునా పవన్ పై పూల వర్షం కురిపించారు అభిమానులు. గుంకలాన్ లో జనప్రభంజనం కనిపించింది. గుంకలాన్ లో ఎక్కడ చూసినా జనసేన జెండాలే కనిపిస్తున్నాయి. అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్.
కరోనాలో కూడా దోచుకున్నారు..పదివేల అరువందల కోట్లు అవినీతి జరిగింది.. దీనిపై మోడీకి వివరాలను అందిస్తాను..వైజాగ్ లో ఇలాగే రాజధాని నిర్మిస్తారా?డబ్బుతో పని లేదు నా సొంత డబ్బు ఖర్చు చేస్తా..పధ్నాలుగు కిలోమీటర్ల స్వాగతం పలికారు..పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత నాపై ఉంది..ఇళ్ల నిర్మాణం పేరుతో పన్నెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది..జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తాది..కనీసం రోడ్లు కూడా వెయ్యలేదన్నారు పవన్ కళ్యాణ్.
బొత్స జేబులో సొమ్ము కాదు. మన టాక్స్ లు ద్వారా వచ్చిన డబ్బులతో ఇదంతా ఇస్తున్నారు..రాజధాని వస్తే ఉత్తరాంధ్ర బాగుపడతాదని ఉత్తిమాటలే చెబుతున్నారు…రోడ్లే వేయ్యని వైసీపీ ప్రభుత్వం రాజధాని కడతారని నమ్ముతున్నారా..పోలీస్ సొసైటీ భూములన కూడా కుదవ పెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం..యువత కోసం రోడ్డుమీద తిరిగే గూండాలతో తలపడతానన్నారు. వైసీపీ నాయకులు, సజ్జల, బొస్స, ధర్మాన వాళ్లకి చెబుతున్నా ఏ ప్రాంత సమస్యలు ఆ ప్రాంతంలోనే తేలుస్తానన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఓట్లు వస్తాయోలేవో అనవసరం నామినేషన్ వేద్దాం.. అడ్డుకుంటే కీళ్లు విరగ్గొడదాం..బూతులు మాట్లాఢం తప్ప యువతకు ఏవిధంగా అవకాశం కల్పించాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఉద్యమనాయకులు ఎవ్వరూ పదవులు తీసుకో లేదు… సమస్య వస్తే పోరాటం చెయ్యాలి..గడప గడప కి వైసీపీ నాయకులొస్తే నిలదీయ్యండి..పనిచెయ్యన్ని నాయకులను కాలర్ పట్టుకు నిలదీయండి..ఇప్పటివరకు సమన్వయం పాటించాం.. మాట్లాడితో సవ్యంగా మాట్లాడండి.. లేకపోతే అదేవిధంగా మాట్లాడాల్సి వస్తాది…రైతుల కన్నీలు తుడిచే పార్టీ జనసేనా.. రైతుకోసం ముప్పై కోట్లు వెచ్చిస్తున్నాం.. ఇప్పటికే అయిదు కోట్లు ఇచ్చాం అన్నారు పవన్ కళ్యాణ్.