NTV Telugu Site icon

Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్‌..

Pawan

Pawan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంతో పాటు.. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌ను మంగళవారం రోజే పరిశీలించారు పవన్‌.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్న జనసేనానికి అపూర్వ స్వాగతం పలికారు అమరావతి రైతులు.. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్‌ వెల్కమ్ చెప్పారు.. సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం పలికారు.. ఇక, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గంటన్నరపాటు సమావేశమైన వివిధ అంశాలపై చర్చించారు..

Read Also: Viral Fevers: వాతావరణంలో మార్పు.. పిల్లలపై విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్

మరోవైపు.. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్‌ కల్యాణ్‌కు కేటాయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా.. పవన్‌ కల్యాణ్‌ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు.. ఈ రోజు ఉదయం 9.30కి విజయవాడలోని తన క్యాంప్‌ ఆఫీస్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. ఆ తర్వాత ఉదయం 11.30కి ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో సమావేశం కానున్నారు జనసేనాని.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, గ్రూప్-2 అధికారులతో చర్చించనున్నారు.. అనంతరం మధ్యాహ్నం 12.30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు పవన్‌ కల్యాణ్. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 164 స్థానాలు వస్తే.. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే.