NTV Telugu Site icon

Pawan Kalyan: మూడు రోజుల్లో జనంలోకి జనసేనాని..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే.. పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది.. ఇక, షెడ్యూల్‌ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి.. రాష్ట్రంలో ప్రచార పర్వం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఓవైపు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోవైపు.. నేటి నుంచే ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో.. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్‌ చేసేలా.. ఆఖరి వ్యక్తి వరకు తమ సందేశం చేరేలా షెడ్యూల్‌ రూపొందించుకున్నారు పార్టీల నాయకులు. మరోవైపు.. మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్..

Read Also: High Temperature: భానుడి భగభగలు.. మూడు రోజులు మరింత హీట్..

నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు చేయనున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రచారం సాగిస్తున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం ప్రచార యాత్ర కూడా రాయలసీమ నుంచే ప్రారంభం అవుతుంది. 31 వరకు ఆయన ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు.

Read Also: CJI DY Chandrachud: కోర్టు దఫేదార్‌ పట్ల ఆత్మీయ చూపిన సీజేఐ

ఇక, ఈ నెల 30వ తేదీ నుంచి జనంలోకి వెళ్లనున్నారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌… తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మూడు రోజులు మకాం వేయనున్నారు. 30 నుంచి మూడు రోజుల పాటు పిఠాపురంలోనే పవన్‌ కల్యాణ్‌ పర్యటన సాగనుంది. 30న నియోజకవర్గ నేతలతో సమీక్ష ఉంటుంది. 31న ఉప్పాడలో సెంటర్‌లో బహిరంగసభలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారు. ఏప్రిల్ 1న పిఠాపురంలో మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత పవన్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార షెడ్యూల్‌ ఖరారు చేయనుంది జనసేన పార్టీ.