Site icon NTV Telugu

Telangana BJP: బీజేపీకి జనసేన సపోర్ట్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Supports Bjp

Pawan Kalyan Supports Bjp

Telangana BJP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన క్యాడర్ ప్రచారాల్లో మునిగిపోయారు. ఓ వైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ సంచలన ప్రకటన చేసింది. నిన్న(మంగళవారం) తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చలు రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తిని రేపుతున్నాయి.

READ MORE: ICC Warns Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై కోర్టుకు జియోస్టార్‌!.. రూ.315 జరిమానా..?

ఈ సమావేశం అనంతరం రామచందర్‌రావు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యాం. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో సహా కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపాం. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారు. ఇది తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు తిరుగులేని వేగాన్ని అందిస్తుంది.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

READ MORE: Mahesh Babu : ‘పోకిరి’ నా జీవితాన్ని మార్చేసింది.. మళ్ళీ ‘వారణాసి’ తో అదే జరగబోతుంది

Exit mobile version