Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ 4సీ కాలనీలోని తన వీరాభిమాని, నిరంజన్ను ప్రత్యేకంగా కలిసి పరామర్శించారు. నిరంజన్ అనారోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఆ బాలుడిని చూసి చలించిపోయారు. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని నమ్మకం కలిగిస్తూ, గుండె నిబ్బరంతో ఉండాలని నిరంజన్ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. నిరంజన్ వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అక్కడికక్కడే అందజేశారు. అంతటితో ఆగకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ బాబు తల్లికి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇస్తానని, అలాగే నిరంజన్ సోదరి (పాప) చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చూపిన ఈ మానవత్వానికి, పెద్ద మనసుకు ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారనే సమాచారంతో హనుమాన్ నగర్ పరిసర ప్రాంతాలకు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారి నిరంజన్ను పరామర్శించిన అనంతరం బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్.. తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు, అభిమానులకు ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ పరామర్శ కార్యక్రమం ముగిసిన వెంటనే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి బయలుదేరి వెళ్లారు.
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!



తాజావార్తలు
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..