Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ను సెట్స్ పైకి తెచ్చి చాలా కాలమైంది. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. కరోనా వల్ల అతి పెద్ద గ్యాప్ వస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలు కారణంగా షూటింగ్‌కు ఇంతకాలం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. గత ఏడాది నుంచి ఈ సినిమా విడుదల తేదీపై ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను 2023 సమ్మర్‌లో విడుదల చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలిసింది. ఇటీవల వైజాగ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌కు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్‌కి సంబంధించిన పని ప్రారంభించాడు. ప్రస్తుతం సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కి ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఇది. కథకు ఇది చాలా కీలకం.
Read Also: Nidhi Agarwal: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం కడుక్కో అన్నాడు
హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఇక దర్శకుడు క్రిష్ అయితే పవన్ కళ్యాణ్ లేకపోయినప్పటికీ అతనితో అవసరం లేనటువంటి కొన్ని సన్నివేశాలను అయితే ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నాడు. ఒకవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరొకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ నిర్ణయించున్నారట. ఇక దర్శకుడు క్రిష్ కూడా ఈసారి ప్రక్క ప్రణాళికతో ఈ స్టార్‌తో కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకుని షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. నిజానికి 2 రోజుల ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. సరిగ్గా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. దీంతో షూటింగ్ ను 2 రోజుల పాటు స్వచ్ఛందంగా ఆపేశారు. తాజాగా రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూట్ మొదలైంది.