Site icon NTV Telugu

Pawan Kalyan: మాజీ సైనికుడిపై హత్యా యత్నానికి తెగబడ్డా పట్టించుకోరా..?

Pawan

Pawan

ఓ మాజీ సైనికుడిపై హత్యా యత్నానికి తెగబడ్డా పట్టించుకోరా? అని జగన్ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. భూ కబ్జాలపై ఫిర్యాదు చేశాడనే దారుణానికి ఒడిగట్టారు.. ఈ ఇష్యూన్ని కేంద్రీయ సైనిక్ బోర్డు దృష్టికి తీసుకువెళ్తాం.. ఒక సైనికుడిగా దేశ రక్షణ విధుల్లో భాగస్వామి అయిన మోపాడ ఆదినారాయణ- తన గ్రామంపై బాధ్యతతో వ్యవహరించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనుకొంటే పాలక పక్షం వ్యక్తులు అతనిపై హత్యా యత్నానికి తెగబడటం దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యనించారు.

Read Also: Sharad Pawar: పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు.. కూటమి సమావేశంలో చర్చిస్తాం

దేశాన్ని శత్రువుల నుంచి కాపాడిన వ్యక్తి స్థానిక గూండాల నుంచి ప్రాణ హానిని ఎదుర్కొంటున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం రౌతుల పాలెంకు చెందిన ఆదినారాయణపై స్థానిక వైసీపీ సర్పంచ్ సంబంధీకులు తీవ్రంగా దాడి చేస్తే పోలీసులు స్పందించలేదు.. హత్యా యత్నానికి సంబంధించిన సెక్షన్లు కాకుండా సాధారణ దాడి అనే విధంగా కేసు నమోదు చేశారని సమాచారం వచ్చింది అని జనసేనాని అన్నారు. వైసీపీ వ్యక్తులు ప్రభుత్వ భూములు, కాలువలను కబ్జా చేసి రెవెన్యూ రికార్డులు మారుస్తున్నారని జిల్లా అధికారులకు ఆదినారాయణ ఫిర్యాదు చేశారని పవన్ తెలిపారు.

Read Also: Kedarnath Yatra: సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు.. కేదారినాథ్ యాత్రలో ఘటన

ఈ క్రమంలో మాజీ సైనికుడిపై దాడి చేశారు అంటే భూకబ్జాదార్లు ఎంతకు తెగిస్తున్నారో అర్థం అవుతోంది అని జనసేన అధినేత పవన్ తెలిపారు. విశాఖ చుట్టుపక్కల ప్రభుత్వమే సహజ వనరులను ధ్వంసం చేసి విలాసవంతంగా నివాస గృహాలు నిర్మించుకొంటోంది.. ప్రజా ప్రతినిధులు ఆస్తులు కొల్లగొడుతున్నారు.. వారి బాటలోనే వాళ్ళ అనుచరులు కబ్జాలు చేస్తూ ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు ఆయన తెలిపారు. యథా పాలకుడు తథా అనుచరుడు అన్న విధంగా వైసీపీ పాలన కొనసాగుతుందని పవన్ అన్నారు.

Read Also: Vijay Setupathi: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ వదిలేసి మంచి పనే చేశాడు..?

మాజీ సైనికుడు ఆదినారాయణపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసు యంత్రాంగం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో ఉన్నతాధికారులు చెప్పాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గతేడాది తిరుపతిలో జనవాణి నిర్వహిస్తే ప్రసాద్ అనే సైనికుడు తన భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేసి వేధిస్తున్నారని వాపోయారు.. రాష్ట్రంలో సైనికులు, మాజీ సైనికులను ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇక్కట్ల పాల్జేస్తుందో ఈ ఘటనలే తెలియ చేస్తున్నాయన్నారు. అతని కుటుంబానికి జనసేన పార్టీ ధైర్యాన్నిస్తూ అండగా నిలుస్తుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Exit mobile version