NTV Telugu Site icon

Pawan Kalyan: రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా..?

Pawan Kalyan

Pawan Kalyan

అమరావతిలో ఎన్ఆర్ఐ జనసేన గల్ఫ్ విభాగం సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. పార్టీకి ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగం కోటి రూపాయల విరాళం అందచేసింది. కౌలు రైతు భరోసా యాత్ర నిమిత్తం మరో రూ. లక్షా 10 వేల విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా? అని ఆయన అన్నారు. కరడుగట్టిన చట్టాలున్న దేశంల్లో బతకొచ్చు.. ఇక్కడ మాత్రం బతకలేని పరిస్థితులు కల్పించారు. రాష్ట్రంలో కౌన్సిలర్ కూడా బెదిరించేస్తాడు.. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అని పవన్ కల్యాణ్ అన్నారు.

Read Also: Sangareddy: కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె..

మన దేశంలో మనకున్న స్వేచ్ఛ కోల్పోకూడదన్నదే నా లక్ష్యం అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. రూల్స్ పాటించాలి.. అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా ఎదిరించాలి.. అలాంటి రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్నదే నా లక్ష్యం అని పవన్ కల్యాణ్ తెలిపారు. విదేశాల్లో ఉన్నవారంతా తిరిగి స్వదేశానికి వచ్చే పరిస్థితులు కల్పించాలి.. కుల దూషణలు చేసే వారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారే రాజకీయ నాయకులుగా ఉన్నారు.. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఒక తరం కోసం నా ఆఖరి శ్వాస వరకు నా నేల కోసం పని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని తెలిపారు.

Read Also: Bussiness Idea: తక్కువ పెట్టుబడి తో లక్షల్లో ఆదాయం .. ఓ లుక్ వేసుకోండి..

గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం మన దేశంలో ఎందుకు బతకలేము?.. ఏ మతం అయినా.. ఏ కులం అయితే ఏంటి? నా తరఫున సమాజానికి నేను ఏమివ్వగలనన్న ఆలోచనల నుంచే పార్టీ స్థాపించాను అని పవన్ కల్యాణ్ చెప్పారు. పదేళ్లుగా నిలబడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను.. 100 శాతం గుర్తింపు వస్తుంది అని జనసేనాని అన్నారు. జనసేనకు మద్దతు ఇచ్చే వారు బలంగా పోరాడగలిగే వారు అయ్యి ఉండాలి.. లేకపోతే మనల్ని బతకనివ్వరు అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.