NTV Telugu Site icon

Pawan Kalyan: నా జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటా..

Pawan Kalyan Speech

Pawan Kalyan Speech

తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారని.. తన గాయాలకి పిఠాపురం ప్రజలు మందు వేశారని కొనియాడారు. జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని తెలిపారు. నేడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. “మీ బలం వలన రెండు లక్షల 8 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. నా గెలుపు ఆంధ్ర ఆత్మ గౌరవం. రాష్ట్రంలో మౌళిక సదుపాయాలు అభివృద్ధి కావాలి. తిరుమలలో జరిగిన ఘటన బాధ కలిగించింది. సంక్రాంతి కి పిఠాపురంలో ఊరంతా పందిరి వేద్దాం అనుకున్నాను.. కానీ తిరుమల ఘటనతో తగ్గించి చేస్తున్నాను. కుదిరితే దసరా బాగా చేసుకుందాం.” అని డిప్యూటీ సీఎం తెలిపారు.

READ MORE: Steve Smith: ఒక్క పరుగుతో 10వేల మైలురాయి మిస్‌.. స్టీవ్ స్మిత్ ఏమన్నాడంటే?

“ఓట్లు కోసం బుగ్గలు నిమరడం, తల కాయలు నిమరడం కాదు. మీరు పిఠాపురం గెలిపించిన వ్యక్తి గిరిజనులకి రోడ్లు వేయించడానికి పని చేస్తున్నాడు. మనసు మానవ సహజం..రాజకీయాల్లో ఎవరు పెట్టుకోరు. అన్నమయ్య జిల్లాలో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాడి చేశారు. ఏపీ ప్రభుత్వం జీతాలుతో బతికిన కుటుంబం నాది.. ఆ రుణం తీర్చుకోవాలి. మా నాన్న మీద దాడి జరిగితే ఎలా స్పందిస్తారో అలా స్పందించాను. 414 గ్రామాలు ప్రజలు డోలిలతో అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం వేల కోట్లు దుర్వినియోగం చేసింది. ఓట్లు కోసం కాదు.. నాకు లెక్కలు లేవు.” అని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Game Changer : దట్ ఈజ్ పవర్ ఆఫ్ రామ్ చరణ్.. అక్కడ ‘గేమ్ ఛేంజర్’ ఆల్‌టైమ్ రికార్డు

అనంతరం పవన్ కళ్యాణ్ గుర్రం జాషువా కవిత చదివి వినిపించారు. గత ప్రభుత్వాన్నీ నడిపిన పెద్ద మనుషులకు ఈ ఆరు నెలలు పాలన పట్ల తృప్తి లేదట.. గత ప్రభుత్వం డైరీలను చంపేశారని తెలిపారు. ఏడీబీ రోడ్డును గత ప్రభుత్వం ఐదేళ్లు వదిలేసిందని.. గత ప్రభుత్వం స్కామ్ లలో రికార్డు సృష్టించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అభివృద్ధిలో రికార్డు సృష్టించిందని వెల్లడించారు.

Show comments