Site icon NTV Telugu

Pawan: చంద్రబాబు జైలు నుంచీ బయటకు వస్తారని ఆశిస్తున్నా..

Pawan Kalyan

Pawan Kalyan

టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచీ బయటకు వస్తారని ఆశిస్తున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ ఒక లాల్ బహాదూర్ శాస్త్రి, వాజ్ పేయి అయితే నేను ఇలా మాట్లాడను.. వచ్చే దశాబ్ద కాలం మనం కలిసి పనిచేయాలి అని టీడీపీకి చెపుతా.. 2009లో కోల్పోయిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఆయన పేర్కొన్నారు. రెండు చోట్ల ఓడిపోయినా దశాబ్ద కాలం తరువాత మీ ముందు నిలబడే ఉంటా.. టీడీపీ- జనసేన ఒకరినొకరు ఎన్నో అనుకున్నాం.. నేను NDAలో ఉన్నాను.. జేపీ నడ్డా, అమిత్ షాలకు మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Read Also: Chiranjeevi: ఆయన ఒక మెంటోర్.. ఒక గైడింగ్ ఫోర్స్.. ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్..

వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను ఏపీ భవిష్యత్తు కోసం నా స్వార్ధాన్ని వెనక్కి పెట్టి పదడుగులు ముందుకొచ్చా.. ఏపీని కాపాడాలని బిజెపి ని అడిగాను.. 30 మంది ఆడపిల్లలు కనిపించడం లేదని చెప్పా.. మీరు నన్ను ముఖ్యమంత్రి గా చూడాలి అంటే మీ ఆశీస్సులతో జరిగితే సంతోషం.. టీడీపీ కూడా జనసైనికులను చాలా జాగ్రత్తగా చూసుకోండి.. 2014లో టీడీపీ- మాతో జరిగినవేమైనా ఉంటే మర్చిపోయి కలిసి ముందుకు పోదాం అని ఆయన చెప్పారు. నేను NDAలోనే ఉన్నా.. ఎక్కడికీ వెళ్ళలేదు రాష్ట్ర భవిష్యత్తుని బంగారుమయం చేయాలని మోడీని కోరుతున్నా.. జగన్ నొక్కని బటన్లు చాలా ఉన్నాయి.. నువ్వు చాలా మందితో పెట్టుకున్నావు.. యువతను ఇబ్బంది పెట్టే వ్యక్తిని ఇంటికి పంపుద్దాం అని కైకలూరు నుంచీ పిలుపిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Exit mobile version