NTV Telugu Site icon

Pawan Kalyan : షాకింగ్.. ‘OG’ కి నో చెప్పిన పవన్ కళ్యాణ్..

Og Mve

Og Mve

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల  అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. కాగా ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా  ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Also Read:Apple cider vinegar : ఈ రెమిడీ తో డాండ్రఫ్ సమస్యకు గుడ్ బై చెప్పండి..

అయితే మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఇక ‘ఓజీ’ పై ఉన్న అంచనాలు చూస్తే ఈ సినిమాను కూడా రెండు భాగాలు చేసినా చేస్తారని అనుకుంటున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రెండు భాగాలు చేయాలని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు నో చెబుతున్నాడని టాక్.

ఇప్పటికే కమిటైన సినిమాల విషయంలో పవన్ కళ్యణ్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారట. ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు భాగాలు అంటే మరి కొన్నాళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అందుకే పవన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కానీ ‘జీతో’ పాటు నాలుగేళ్ల క్రితం మొదలైన ‘హరి హర వీరమల్లు’ మూవీ మాత్రం రెండు భాగాలుగా వస్తుంది. కథ ప్రకారం ఈ  వీరమల్లు మూవీని ఒక భాగంలో చూపించడం కష్టం. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.