తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో జనసేన పార్టీని విస్తరించండని అంటున్నారని.. తాను విస్తరించాలి అంటే ముందు మీరు పోరాటం చేయండి అని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మీకు అండగా సైద్ధాంతిక బలం తాను ఇస్తాను అని, మీరు బలోపేతం చేస్తే ఖచ్చితంగా ఒకరోజున జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందన్నారు. తాను ఒకరోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది అంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు.. కానీ ఖచ్చితంగా ప్రజలు అందరూ కలిసి వస్తే అది నిజం అవుతుందని పవన్ చెప్పారు. తాను ఒక కులం కోసం ఆలోచిస్తే ఆ కుల నాయకుడిని అయ్యేవాడినని.. కానీ ప్రజా నాయకుడిని అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తాను అన్ని వర్గాలకు న్యాయం చేయాలని పరితపించే వ్యక్తిని అని పవన్ చెప్పుకొచ్చారు.
విశాఖలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘మేము విశాఖలో జనవాణి పెట్టడానికి వస్తే చంపేస్తామని బెదిరించారు. హోటల్ నుంచి బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి.. రౌడీలు అని అన్నారు. వాళ్లని వదిలే వరకు కదలను అని చెప్పాను. పరమశివుని ఆయుధం త్రిశూల్ పేరుతో జనసైనికుల కోసం ప్రత్యేక ప్రోగ్రాం సిద్ధం చేశాం. మెంబర్షిప్ టు లీడర్షిప్ అనేలా నిరంతరం రాజకీయ అధ్యయనం జరిగేలా జనసైనికులకు, వీర మహిళలకు అవకాశాలు కల్పించనున్నాం. నేను ఒక కులం కోసం ఆలోచిస్తే కుల నాయకుడిని అయ్యేవాడిని. కానీ నేను ప్రజా నాయకుడిని అవ్వాలి అని వచ్చాను. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని పరితపించే వ్యక్తిని. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి జనసేన విస్తరించండి అంటున్నారు. నేను విస్తరించాలి అంటే ముందు మీరు పోరాటం చేయండి. మీరు బలోపేతం చేయండి ఖచ్చితంగా ఒకరోజున జనసేన పార్టీ జాతీయ పార్టీగా ఎదుగుతుంది. నేను ఒకరోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది అంటే అది ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ప్రజలు అందరూ కలిసి వస్తే అది నిజం అవుతుంది’ అని అన్నారు.
Also Read: Pawan Kalyan: సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ.. నా నిర్ణయం సరైందే!
‘ప్రతీ జనసైనికుడికి కేంద్ర కార్యాలయంతో అనుసంధానం అయ్యే వ్యవస్థ తీసుకురానున్నాం. గ్రామ స్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు నాయకులు అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేలా మెంబర్షిప్ టు లీడర్షిప్ కార్యక్రమం ద్వారా కొత్తతరం నాయకులను సిద్ధం చేయనున్నాం. ప్రతీ కార్యకర్తను సమర్థవంతమైన నాయకుడిగా సిద్ధం చేయనున్నాను. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యతను నేనే తీసుకున్నాను. ప్రతీ రోజు 4 గంటలు పార్టీ అడ్మినిస్ట్రేషన్ కోసం కేటాయించనున్నాను. ఒక నల్లమల 18 ఏళ్ల యువకుడు వెయ్యి రూపాయలు అప్పు తీసుకుని 2 చోట్ల ఓడిపోయిన సమయంలో వర్షంలో తడిచి వచ్చి యురేనియం త్రవ్వకం ఆపాలని కలిశాడు. ఆరోజు నాతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీలు కలిసి వచ్చాయి. చర్చ పెట్టాం, అప్పుడు నాటి ప్రభుత్వం యురేనియం త్రవ్వకాలు ఆపింది. మహిళలను బలమైన నాయకులుగా తీర్చిదిద్దనున్నాం. నిబద్ధత, స్థిరత్వం, క్రమశిక్షణ ఉన్న ప్రతీ కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతాం. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న తరవాత, వారికి ఏ అంశంలో ఆసక్తి ఉందో గుర్తించి దానికి అనుగుణంగా నాయకత్వాన్ని తీర్చిదిద్దనున్నాం. విజయనగరంలో ఉన్న గురజాడ అప్పారావు గారి గృహాన్ని ఆధునీకరణ చేయాలని వారి మనువడు మా దృష్టికి తీసుకొచ్చారు. దానిని అభివృద్ధి చేస్తాం. ఎదురుగా ఉన్న స్థలంలో ఆడిటోరియం నిర్మించేలా చేసి, వారి రచనలను డిజిటలైజేషన్ చేయనున్నాం’ అని పవన్ తెలిపారు.
