Site icon NTV Telugu

Pawan Kalyan: ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.. సీఎం ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ రిప్లయ్!

Hhvm (3)

Hhvm (3)

Pawan Kalyan’s response to CM Chandrababu’s tweet: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఐదేళ్లుగా షూటింగ్‌ జరుపుకున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా నేడు రిలీజ్ అయింది. పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే మూవీ రిలీజ్ ముందు బుధవారం సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. సీఎం ట్వీట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిప్లయ్ ఇచ్చారు. సీఎం ట్వీట్ తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, అదే సమయంలో ఆనందాన్ని కలిగించిందని పవన్ పేర్కొన్నారు .

‘గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో గత పదేళ్లలో పలుమార్లు సమావేశమైనా.. ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి చంద్రబాబు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా’ అని పవన్ కళ్యాణ్ పోస్టులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Exit mobile version