Pawan Kalyan: సీఐ అంజుయాదవ్‌పై పవన్ సీరియస్.. అక్కడికే వచ్చి తేల్చుకుంటా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసిన విషయం విదితమే… సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇందులోభాగంగా పట్టణంలోని పెళ్లిమండం దగ్గర సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని మహిళా సీఐ అంజు యాదవ్ తేల్చిచెప్పారు. అయినా దిష్టిబొమ్మ కాల్చేందుకు యత్నించడంతో పలువురు నాయకుల్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆ తర్వాత జనసేన నాయకులు పోలీసుల కళ్లగప్పి కూడలి దగ్గరకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ చేయిచేసుకున్నారు. చిత్తూరు జిల్లా కార్యదర్శి సాయి రెండుచెంపలను చెళ్లుమనించారు సీఐ. దీంతో.. ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.. జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్..
Read Also: PUBG Love Story: సీమా హైదర్ పాకిస్తాన్ తిరిగి రావాలి.. లేకుంటే ముంబై తరహా దాడి..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తణుకు నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీర మహిళలతో మాట్లాడారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. జనసేన కార్యకర్తను పోలీసులు కొట్టడం మంచిది కాదని హెచ్చ రించారు.. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపితే.. అతణ్ని ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. అయితే, ఈ విషయంలో తాను ఇప్పుడు ఇంక మాట్లాడబోనని, తాను స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి సంగతేంటో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. జనసైనికులపై దెబ్బ పడితే నేనే వస్తాను.. మా పార్టీ నాయకుడు సాయిని కొట్టారు.. నేనే స్వయంగా శ్రీకాళహస్తి వస్తాను.. మా వాడిని ఎందుకు కొట్టారు అని నిలదీస్తా అన్నారు.. మా వాడిని కొట్టారు.. నన్ను కొట్టినట్టే అన్నారు. ఇక, నేను నమ్మిన సిద్ధంతం కోసం నాకు పెచ్చి ఉంటుంది.. నా కుటుంబాన్ని చంపేస్తారా? చంపేయండి.. అని వ్యాఖ్యానించారు.. అంత తెగింపు నాలో ఉంది.. అలా తెగించకపోతే.. ఈ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూల్చలేమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!