NTV Telugu Site icon

Pawan Kalyan: సీఐ అంజుయాదవ్‌పై పవన్‌ సీరియస్‌.. అక్కడికే వచ్చి తేల్చుకుంటా..!

Pawan

Pawan

Pawan Kalyan: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసిన విషయం విదితమే… సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇందులోభాగంగా పట్టణంలోని పెళ్లిమండం దగ్గర సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని మహిళా సీఐ అంజు యాదవ్‌ తేల్చిచెప్పారు. అయినా దిష్టిబొమ్మ కాల్చేందుకు యత్నించడంతో పలువురు నాయకుల్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆ తర్వాత జనసేన నాయకులు పోలీసుల కళ్లగప్పి కూడలి దగ్గరకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ చేయిచేసుకున్నారు. చిత్తూరు జిల్లా కార్యదర్శి సాయి రెండుచెంపలను చెళ్లుమనించారు సీఐ. దీంతో.. ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి వెళ్లింది.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌..

Read Also: PUBG Love Story: సీమా హైదర్ పాకిస్తాన్ తిరిగి రావాలి.. లేకుంటే ముంబై తరహా దాడి..

తణుకు నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీర మహిళలతో మాట్లాడారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. జనసేన కార్యకర్తను పోలీసులు కొట్టడం మంచిది కాదని హెచ్చ రించారు.. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపితే.. అతణ్ని ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. అయితే, ఈ విషయంలో తాను ఇప్పుడు ఇంక మాట్లాడబోనని, తాను స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి సంగతేంటో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. జనసైనికులపై దెబ్బ పడితే నేనే వస్తాను.. మా పార్టీ నాయకుడు సాయిని కొట్టారు.. నేనే స్వయంగా శ్రీకాళహస్తి వస్తాను.. మా వాడిని ఎందుకు కొట్టారు అని నిలదీస్తా అన్నారు.. మా వాడిని కొట్టారు.. నన్ను కొట్టినట్టే అన్నారు. ఇక, నేను నమ్మిన సిద్ధంతం కోసం నాకు పెచ్చి ఉంటుంది.. నా కుటుంబాన్ని చంపేస్తారా? చంపేయండి.. అని వ్యాఖ్యానించారు.. అంత తెగింపు నాలో ఉంది.. అలా తెగించకపోతే.. ఈ క్రిమినల్‌ సామ్రాజ్యాన్ని కూల్చలేమన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.