Pawan Kalyan : లుక్ అదిరిందిగా.. హరిహర వీరమల్లు షూట్ నుంచి పవన్ ఫోటో లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన డిప్యూటీ సీఎం కావడంతో ఇటు ప్రభుత్వంలో పాలన చూసుకుంటూనే అటు సినిమాలు చేస్తున్నారు. ఆయన అభిమానుల కోసం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. రీసెంట్ గా ఈ సినిమా కోసం మంగళగిరిలోనే సెట్ వేశారు. ఆ సెట్‌లో పవన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది.
Read Also:TTD laddu controversy: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. దర్యాప్తులో సిట్ దూకుడు.. టీమ్‌లు విడిపోయి..!
Also Read
- Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమా ఆలస్యమవడంతో ఆయన తప్పుకున్నారు. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం కీరవాణి చాలా స్పెషల్ సాంగ్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దసరా కానుకగా పవన్ కళ్యాణ్ అభిమానులకు తొలి పాటను విడుదల చేసే అవకాశాలున్నాయి. అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ హరిహర వీరమల్లు సినిమాలోని మొదటి పాటను దసరాకు అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. తాజాగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది.
Read Also:T20 World Cup 2024: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
హరిహర వీరమల్లు సెట్స్ నుంచి లీకైన ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ సినిమా కాస్ట్యూమ్ తో నవ్వుతూ ఉన్నారు. ఆ పక్కనే మరో ఆర్టిస్ట్ ఉన్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఒక్క ఫొటోకే సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు ట్రెండ్ అవుతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం అవుతుంది. లీక్ అయిన ఫోటో మీరు కూడా చూసేయండి.. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ పలువురు బాలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్రల్లో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?