Site icon NTV Telugu

Breaking… Pawan Meets Chandrababu: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

Pawan Babu

Pawan Babu

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక వైపు వేసవి తీవ్రత ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం వేడి రాజుకుంటోంది. తాజాగా జరిగిన పరిణామాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కొద్దిసేపటి క్రితం ఇరువురు నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మూడోసారి చంద్రబాబు.- పవన్ భేటీ జరిగింది.

Read Also: Shivraj Singh Chouhan: ప్రధాని మోడీ “నీలకంఠుడు”.. విషసర్పం విమర్శలకు కౌంటర్..

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు-పవన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ రాజకీయాల పైనా బాబు-పవన్ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న వేళ ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వీరు భేటీ కాగా తాజా భేటీపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీపైనే అందరి కళ్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే గతంలో విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పర్యటన అర్థాంతరంగా ముగించుకుని వచ్చేశారు. దీంతో పవన్ కు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు భేటీ అయ్యారు. అప్పటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్, ఈ విధంగా ఒకరికొకరు కలుసుకుని సంఘీభావం తెలుపుకుంటున్నారు.

ఇటీవల పవన్ ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. బీజేపీ పెద్దలతో పొత్తుల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా? జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయా లేదా టీడీపీ-బీజేపీ-జనసేన మూకుమ్మడిగా కలిసి పోటీ చేస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఇద్దరు నాయకులు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Read Also: Selfish: బర్త్ డేన ‘దిల్ ఖుష్…’ అంటున్న ఆశిష్‌!

Exit mobile version