Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో మంటలు రేపాయి.. అయితే, మరోసారి వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.. అతిచిన్న జీతం తీసుకునే వాలంటీర్ వ్యవస్థ పొట్టగొట్టాలని నాకులేదన్న ఆయన.. ఐదువేల జీతం ఇచ్చి వారిని అక్కడే కట్టిపడేస్తున్నారు.. వారిలో ఎంతోమంది బలవంతులున్నారు.. వారిలో సైంటిస్టులు, వ్యాపారస్తులు ఇలా ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లున్నారన్నారు.. డిగ్రీ చదువుకుని ఐదువేలు ఇస్తూ ఊడిగంచేపిస్తున్నారు.. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చే డబ్బులు కూడా వారికి రావడంలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగం ఎక్కువ కావడంతో ఐదువేలకు పనిచేస్తున్నారు.. శ్రమదోపిడి జరుగుతోంది.. రాష్ట్రంలో ఇన్నివేల మంది మిస్సవుతున్నారనేది చెబితే ఎందుకు పట్టించుకోవడంలేదు అని మండిపడ్డారు పవన్.. కేంద్ర నిఘావర్గాలు దీనిపై చాలా లోతైన విచారణ చేస్తున్నారు.. ఐదువేల రూపాయలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారు.. మీ వివరాలు మొత్తం వారిచేతుల్లో పెట్టాల్సి వస్తోందన్నారు. అందరి వాలంటీర్స్ గురించి నేను మాట్లాడటం లేదు.. కానీ, కొన్ని చోట్ల వాలంటీర్స్ వద్ద ఉన్న డేటా బయటికి వెళ్తోంది.. రెవిన్యూవ్యవస్థ బలంగా ఉన్నా సమాంతర వ్యవస్థ ఎందుకు అని ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్యేకి కంట్రోల్ ఉన్నా బాగుండేది.. ఐదువేల రూపాయాలు తీసుకునేవారిలో కొద్దిమంది తప్పు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి.. ప్రభుత్వ ఉద్యోగులు కానివారికి ఎందుకు మన సమాచారం ఇవ్వాలి..? అని ప్రశ్నించారు. వాలంటీర్స్ కు సంబంధించిన ప్రతి విషయం ఎస్పీలు, కలెక్టర్ల వద్ద ఉండాలి.. వాలంటీర్లు తప్పు చేస్తే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థను చాలా జగర్తగా చూడాలి.. వారితో అప్రమత్తంగా ఉండాలి.. వాళ్ళపని వారు చేస్తే పర్లేదు.. వైసీపీ పార్టీకి మాత్రమే పనిచేస్తామంటే గట్టిగా అడగండి అని సూచించారు. ఉచిత బియ్యం వ్యాన్లు బియ్యం పంపిణి తర్వాత ఎక్కడకు వెళుతున్నాయి ? అని ప్రశ్నించారు పవన్.. ఒంటరి మహిళలు, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా లేదా అనేది ప్రతిఒక్కరు చూడాలి.. ఇంతమంది మహిళలు కనిపించపోతే ఒక్క సమీక్ష జరపలేదు.. ప్రతిపార్టీ వారు వాలంటీర్ వ్యవస్థపై ఒక కన్నువేసి ఉంచాలన్నారు.
ఆడబిడ్డలు ఉన్న కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉండాలి.. అనవసరంగా మీడేటావారికి ఇవ్వకండి అన్నారు పవన్.. వాలంటీర్ల అందరి గురించి మాట్లాడటంలేదు.. వంద తాజాపళ్లలో ఒక్కటి కుళ్లినామిగతావి కుళ్లుతాయి.. వాలంటీర్లు సమాంతర పోలిస్ వ్యవస్థ, సమాంతర అడ్మినిస్టేషన్ వ్యవస్థ, సమాంతర రాజకీయ వ్యవస్థగామార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఇపుడు సరిగా చూడకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఇబ్బంది.. పులివెందుల అంటే ఒకప్పుడు సరస్వతి నిలయం.. పులివెందుల సంస్కృతిని మార్చేశారని ఆరోపించారు.. ఇంట్లో ఆడవారి జోలికి రాకుడదనే సంస్కారం జగన్‌కు నేర్పిస్తాను అంటూ హాట్ కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.