Site icon NTV Telugu

Pawan Kalyan: జగన్ గురించి ప్రధానికి చెప్పాల్సిన అవసరం లేదు.. మేమే చూసుకుంటాం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: నా దగ్గర సమర్థత లేకపోతే ప్రధాని ఒక ముఖ్యమంత్రితో పాటు సమానంగా నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. సీఎం వైఎస్‌ జగన్ గురించి ప్రధాని దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు.. ప్రస్తావించాల్సి వస్తే ఏం ప్రస్తావించాం అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా జనసేనలో ఉంటే వాళ్ళు జనసేన నాయకులు.. ఏ సామాజిక వర్గానికి చెందినవారు అనేది దానికి ప్రాధాన్యత కాదు .. నిలబడేవారా? కాదా? అనేదానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ధైర్యం ఉన్నవాడు పోరాటం చేస్తే బ్రిటీష్ వాళ్ళే పారిపోయినప్పుడు జగన్ ఎంత? అని ప్రశ్నించారు

ఇక, నా పోరాటం వైఎస్‌ జగన్ పై కాదు.. ఆయన పరివర్తనపైనే అన్నారు పవన్‌.. జగన్‌ తనకు శత్రువు కాదు.. అతనికి అంత సీన్‌ లేదన్న ఆయన.. ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలపైనే తన పోరాటమని, బ్రిటీష్ వాళ్లే పారిపోయినప్పుడు జగన్‌ ఎంత అని ప్రశ్నించారు. జనసేన వచ్చాక పెండింగ్ లో ఉన్న సుగాలి ప్రీతి లాంటి కేసుల సంగతి తెలుస్తాం అన్నారు. సీఎం జగన్‌ జగన్ గురించి ప్రధాని దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదు.. ప్రస్తావించాల్సి వస్తే ఏం ప్రస్తావించాం అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్న ఆయన.. జగన్ మా ఇలాఖ పిల్లాడు. . ఆయన సంగతి మేమే చూసుకుంటాం అన్నారు. రాజకీయ అవినీతిని నిర్మూలించడం జనసేన మొదటి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చిన పవన్‌.. 300 లంచం తీసుకునే పోలీసు నేరం కంటే.. టీడీఎస్ బాండ్స్ పేరుతో 309 కోట్లు దోచేసిన రాజకీయనేతది పెద్ద తప్పు అన్నారు.

జనసేన నమ్మిన ఏడు సిద్ధాంతాలు చాలా బలమైనవి.. కొద్దికాలం తర్వాత భారతదేశ రాజకీయాలు మొత్తం ఆ ఏడు సూత్రాలే నిర్దేశిస్తాయి అన్నారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, మరోసారి చెప్పుల ప్రస్తావన తీసుకొచ్చారు పవన్‌.. అన్నవరంలో చెప్పులు పోవని మనోహర్ చెబితే వేసుకొని గుడి వరకు వెళ్లాను.. మొన్న ఎవరో చెప్పారు మచిలీపట్నంలో చెప్పులు కనిపించాయని అని జోకులు పేల్చారు.. అత్తారింటికి దారేది సినిమాపైరసీ అయితే దాని మూలాలు మచిలీపట్నంలో తేలాయి.. దానికి దీనికి లింక్ ఏంటి..? అని ప్రశ్నించారు.. కడపలో సినిమా ప్రింట్ అయితే మచిలీపట్నంలో తేలింది.. అన్నవరంలో చెప్పులు మిస్ అయితే మచిలీపట్నం వైపు కనిపించాయి.. ఇది యాదృచ్ఛికమా ఇంకేదైననా? ఉందా? ఏంటో చూడాలన్నారు. వచ్చే ఎన్నికల కోసం మనందరం బాగా పనిచేద్దాం జనసేనని గెలిపిద్దాం అంటూ పిలుపునిచ్చారు పవన్‌ కల్యాణ్

Exit mobile version