రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ పైకి వచ్చేసాడు. ఏపీ పాలిటిక్స్ హీట్ పెరగడంతో, సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లుకి కొన్ని రోజులుగా వాయిదా వేస్తూ వచ్చాడు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్, ఆలోపే దర్శకుడు క్రిష్ చేస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా సినిమా అయిన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ని కంప్లీట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. ఔరంగజేబు కాలంలోని బందిపోటుగా నటిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న హరిహర వీరమల్లు సెట్స్ లో యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ స్టిల్ ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాస్త బ్రౌనిష్ టింట్ ఉన్న బట్టల్లో పవన్ కళ్యాణ్ ఫోటో పవన్ ఫాన్స్ లో జోష్ నింపింది.
Read Also: Masooda: హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ కు ‘దిల్’ రాజు అభినందనలు!
ఇప్పటివరకూ తెలుగుకి మాత్రమే పరిమితం అయిన పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఈ మూవీలో ఔరంగజేబుగా హిందీ నటుడు ‘బాబీ డియోల్’ నటిస్తున్నాడని టాక్ ఇండస్ట్రీలో ఉంది కానీ మేకర్స్ నుంచి అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ని దృష్టిలో పెట్టుకోని డైరెక్టర్ క్రిష్, హరిహర వీరమల్లు షూటింగ్ ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసాడట. స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేసినా క్వాలిటీ విషయంలో క్రిష్ ఎక్కడా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపించట్లేదు. గ్లిమ్ప్స్ తో ఇప్పటికే పవన్ ని ఎలా చూపించబోతున్నాడో లైట్ గా చూపించిన క్రిష్… పాన్ ఇండియా సినిమాకి సరిపోయే పర్ఫెక్ట్ విజువల్ గ్రాండియర్ ని సిద్దం చేస్తున్నాడు.