NTV Telugu Site icon

Pawan Kalyan: దేశ సంస్కృతిని కాపాడేది బీసీలే.. వారిపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: బీసీలపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం అని ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మంగళగిరిలో టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అక్రమాలపై వైసీపీలోని బీసీ నేతలు ఆలోచించాలని సూచించారు.. బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుంటే బీసీ కులాలకు అన్యాయం చేసినట్టేనని వైసీపీ బీసీ నేతలు ఆలోచించాలని హితవుపలికారు.. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆకాక్షించారు.. బీసీల కోసం ఏడాదికి రూ. 75 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ, అది సున్నా.. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు హామీని గాలికి వదిలేశారని మండిపడ్డారు.

Read Also: Weight Loss Tips: ఈ పొడిని రోజూ తీసుకుంటే చాలు.. కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..

అమర్నాథ్‌ గౌడ్ అనే కుర్రాడిని పెట్రోల్ పోసి చంపేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌.. భారత దేశ సంస్కృతిని కాపాడేది బీసీలే అన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వడ్డెర్లకు ఆర్థికంగా బలం చేకూరేలా చేస్తాం.. పల్లెకార్ల కులాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గంగవరం పోర్టు నిర్వాసితులు సహా అందరికీ న్యాయం చేస్తాం. తీర ప్రాంతంలో ప్రతి 30 కిలో మీటర్లకు ఓ జెట్టి ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బీసీల దగ్గర డబ్బు ఉండకూడదని జగన్ జీవోలు తెచ్చారని విమర్శించారు. 153 బీసీ కులాలకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించిన ఆయన.. బీసీలు ఐక్యంగా ఉంటే.. ఎవ్వరూ ఏం చేయలేరన్నారు. బీసీలకు ఎన్టీఆర్ అధికారం కల్పిస్తే.. జగన్ వచ్చీ రాగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లల్లో 10 శాతం కోత విధించారని దుయ్యబట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఇక, జయహో బీసీ సభా వేదికగా పవన్ కల్యాణ్ చేసిన పూర్తి ఉపన్యాసం కోసం కింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి..