Site icon NTV Telugu

Pawan Kalyan : ఇక పై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా

Pawan

Pawan

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బస్‌ యాత్ర చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ బస్‌ యాత్ర గత దసరాకు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే.. పవన్‌ కల్యాణ్‌ నిర్వహించ తలపెట్టని బస్‌ యాత్ర వాహనం ఇటీవల రెడీ కావడంతో ట్రయల్‌ రన్‌ చేసి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు పవన్‌. ‘వారాహి’ ఈజ్‌ రెడీ ఫర్‌ బ్యాటిల్‌ అంటూ నెట్టింట పోస్ట్‌ చేశారు. దీంతో ఈ ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి. అయితే.. జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎలక్షన్ బ్యాటిల్ కోసం రెడీ చేసుకున్న వారాహి వాహనం కలర్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. వారాహి రంగు మిలటరీ రంగును పోలి ఉండటంతో వివాదం చెలరేగింది. దీన్నే టార్గెట్‌ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నింబంధనలకు విరుద్ధంగా రంగులు వేశారని ఆరోపిస్తున్నారు.

Also Read :BRS Celebrations: బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడకలు.. నగరానికి కర్ణాటక మాజీ సీఎం
దీనిపై పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ.. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తన సినిమాలను అడ్డకున్నారని.. ఆపై విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. బలవంతంగా తనను విశాఖ నగరం నుంచి పంపించి వేశారని పవన్ పేర్కొన్నారు. మంగళగిరిలో సైతం తను కారులో వెళ్తుంటే అడ్డుకున్నారన్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న తనను ఆపేశారన్నారు. ఇప్పుడు వాహనం రంగు పైనా వివాదం చేస్తున్నారన్నారు. ఇక పై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా అని పవన్ ఫైర్ అయ్యారు పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version