NTV Telugu Site icon

Pawan Kalyan : గాంధీ, అంబేద్కర్ కంటే వైఎస్సార్ గొప్ప వ్యక్తి కాదు

Pawan Kalyan Ippatam

Pawan Kalyan Ippatam

నేడు మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. అయితే.. ఈనేపథ్యంలో ఇప్పటం గ్రామస్తులకు చెక్కుల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతతో నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున అభిమానులున్న నన్నే ఇంత ఇబ్బంది పెడుతోంటే.. ఇప్పటంలో ఓ ఆడపడుచును ఎంతగా ఇబ్బంది పెడతారో నాకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. నా కులపొళ్లతో నన్ను ఎందుకు తిట్టిస్తున్నారు..? అని ఆయన మండిపడ్డారు. 2024 ఎన్నికలు కీలక ఎన్నికలు అని, నేను ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పనని, 2014 నుంచి వివిధ సందర్భాల్లో ప్రధాని మోడీని కలిశానని ఆయన వెల్లడించారు. ప్రధానితో నేనేం మాట్లాడానో సజ్జలకు ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘ప్రధానితో నేనేం మాట్లాడానో తెలుసుకోవాలంటే నా దగ్గరకు రా చెవిలో చెబుతా. వైసీపీని దెబ్బ కొట్టాలంటే బీజేపీకి చెప్పి చేయను.. నేనే కొడతా. నా యుద్దం నేనే చేస్తా.. ఢిల్లీ వెళ్లి చెప్పను.
Also Read : PM Modi : మన్‌కీ బాత్‌లో తెలంగాణ ప్రస్తావన.. సిరిసిల్ల నేతన్నపై ప్రశంసలు
నేను అధికారం లేని వాడిని.. నా మీద పడి వైసీపీ నేతలు ఎందుకు ఏడుస్తారు. ఇప్పటం గ్రామానికి వస్తే.. నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు పెట్టారు. కారులో వద్దన్నారు.. నడవద్దన్నారు.. నాకు తిక్క వచ్చి కారెక్కా. 175 స్థానాలకు.. 175 స్థానాలు మీకొచ్చేస్తే.. మేం చూస్తూ కూర్చొంటామా..? నోట్లో వేలు పెట్టుకుని కూర్చుంటామా..? 175 స్థానాలు తీసేసుకుని ఇంకొన్ని ఇళ్లు కూల్చమని చెప్పేస్తామా..? నా అభిమానులు కూడా గత ఎన్నికల్లో ఓటేస్తే.. మీరు చేసే పని ఇదా..? వైసీపీని ఇలాగే వదిలేస్తా.. వైఎస్సార్ కడప అని పేరు పెట్టినట్టు.. వైఎస్సార్ ఇండియా అని పెట్టేస్తారేమో..? ఎన్టీఆరుతో జగన్ పోల్చుకోవద్దు. వైఎస్సార్ గాంధీ, అంబేద్కర్ కంటే గొప్ప వ్యక్తి కాదు. జగన్ ఉత్తముడేం కాదు.. జగన్ ఉత్తముజడైతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాం.

Also Read : Kuppam Railway Station: కుప్పం రైల్వేష్టేషన్‌ లో ఉద్రిక్తత.. హౌరా ఎక్స్‌ ప్రెస్‌ లో మంటలు
2024 ఎన్నికలు చాలా కీలకం. వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతివ్వండి. నన్ను చూసి ఓటేయొద్దు.. గత 15 ఏళ్లుగా నేనేం చేశాను.. మా విధానాలను చూసి ఓటేయండి. ఈసారి ఆచితూచి అడుగులేస్తూ వ్యూహాలు ఉంటాయి.. మద్దతివ్వండి. మమ్మల్ని బెదిరించే వారు ఎవ్వరైనా సరే ఎల్లవేళలా అధికారంలో ఉండరు. 2024 ఎన్నికలు తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్లకు సమాధానం చెబుతా. ఇప్పటి నుంచే వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారినెవ్వర్నీ మరిచిపోను. వైసీపీపై పవన్ సీరియస్ కామెంట్లు. బీజేపీతో సంబంధం లేకుండానే వైసీపీని కొడతానన్న పవన్. 2024లో తమను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతానన్న పవన్. డిఫ్యాక్టో సీఎం అంటూ సజ్జలపై మండిపాటు. సజ్జలే ఇప్పటం ఇళ్ల కూల్చివేతల వెనుక ఉన్నారంటూ మండిపాటు. వైసీపీని కొట్టాలంటే బీజేపీకి చెబుతానా అంటూ పవన్ నర్మగర్భ వ్యాఖ్యలు. బీజేపీతో సంబంధం లేకుండా సొంతంగానే వైసీపీని దెబ్బ కొడతా.’ అని పవన్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు.