NTV Telugu Site icon

Pawan Kalyan: వల్లభనేని వంశీపై మండిపడ్డ పవన్‌.. ఒక ఓటు అటు.. ఒకటి ఇటు అంటున్నాడట..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: గన్నవరం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్‌లో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివేకం కలిగిన నాయకుడు అని అనుకున్నాను.. పాలసీ పరంగా విబేధాలు ఉంటే మాట్లాడవచ్చు.. కానీ, దానికి ఒక పరిమితి ఉంటుంది.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ జనసేనకి, ఎమ్మెల్యే తనకు ఓటు వేయాలని వంశీ కోరుతున్నారట అది సరికాదు అని హితవుపలికారు.. ఇక, ఎన్టీఆర్ కుమార్తెపై వల్లభనేని వంశీ.. అసెంబ్లీలో మాట్లాడటం నాకు బాధ కలిగించిందన్నారు పవన్‌.. నారా భువనేశ్వరిని కించపరచడం బాధ కలిగించిందన్న ఆయన.. వంశీకి జనసేన శ్రేణులు ఓట్లు వేస్తే.. స్త్రీని అగౌరవపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందన్నారు.

Read Also: Sun Stroke: హీట్ స్ట్రోక్ రోగుల కోసం ఐస్ మేకింగ్ రిఫ్రిజిరేటర్, ఇమ్మర్షన్ టబ్.. ఫొటోస్ వైరల్..

ఇక, మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రికి ఎన్నికలు ఉన్నాయి.. రాష్ట్ర దిశ, భవిష్యత్ ను నిర్ణయం చేసే ఎన్నికలు ఇవి.. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌.. ఆత్మ గౌరవం తాకట్టు పెట్ట లేక వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేతలు బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం హనుమాన్‌ జంక్షన్‌లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించింది. భారీ ర్యాలీగా హనుమాన్ జంక్షన్ చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత సభలో మాట్లాడారు… ఓవైపు సీఎం వైఎస్‌ జగన్‌పై మండిపడుతూనే.. మరోవైపు.. వల్లభనేని వంశీపై విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతంగా ఉండే కూటమి ప్రభుత్వం వస్తేనే యువతకు ఉపాధి ఇవ్వగలుగుతుంది అన్నారు పవన్‌ కల్యాణ్‌.

మరోవైపు.. గన్నవరం నియోజక వర్గంలో వందల కోట్లు దోపిడీ జరిగింది అని ఆరోపించారు పవన్.. వంశీ డబ్బులు ఇచ్చినా మాయమాటలు చెబితే నమ్మవద్దు.. వంశీ నాకు పరిచయమే..కానీ జనహితం నాకు ముఖ్యం అని స్పష్టం చేశారు.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ మారుస్తూ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ దృష్టిలో పడటానికి ఎంతకైనా దిగజారారు.. ఏపీ రాజకీయాలను వైసీపీ నేతలు దిగజార్చారని ఫైర్ అయ్యారు.. యువతికి ఉపాధి కల్పిస్తాం .. వచ్చే ఎన్నికల్లో కూటమిదే పీఠం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్