Site icon NTV Telugu

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం విషయంలో సీఎంకు శ్రద్ధ లేదా..?

Pawan Kalyan

Pawan Kalyan

ఏపీ ఆస్తులను సీఎం జగన్ పొరుగు రాష్ట్రానికి ధారాధత్తం చేసేశారంటూ జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు. నేడు మంగళగిరిలో జనసేన లీగల్‌ సెల్‌ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. తనకు.. తన సోదరి మధ్య ఆస్తుల గొడవలపై జగన్ చాలా ఫోకస్ పెట్టారన్నారు. ఆ ఆస్తి నాది.. ఈ ఆస్తి నీది అని పంచుకున్నారు. సొంత ఆస్తుల విషయంలో ఇంత శ్రద్ధ పెట్టారే.. ఏపీ ఆస్తులను తెలంగాణ వాళ్లకి ఇష్టానుసారంగా ఎలా కట్టబెట్టేశారు..? తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం విషయంలో సీఎంకు శ్రద్ధ లేదా..? తెలంగాణ సీఎంతో కప్పు కాఫీ తాగుతూ.. పెసరట్టు ముక్క తింటూ ఏపీ ఆస్తులను ఇచ్చేస్తారా..? రూ. 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను దారి మళ్లించారు.

రూ. 400 కోట్ల మేర ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నిధులను మళ్లించారు. స్థానిక సంస్థల నిధులనూ పక్కదారి పట్టించారు. ఈ దారి మళ్లింపుపై ఎవరు ప్రశ్నిస్తారు..? నా జీవితంలో నేను చేసిన మంచి పని రాజకీయాల్లోకి రావడమే. మెజార్టీ ఉందని తీసుకునే ప్రతి నిర్ణయం కరెక్ట్ అనుకోవడానికి లేదు. 2019లో ప్రజలు ఆలోచించి ఓటేశారో.. ఒక్క ఛాన్స్ అని ఓటేశారో కానీ.. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

 

 

Exit mobile version