NTV Telugu Site icon

Pawan Kalyan: కోనసీమలో కావాలనే చిచ్చుపెట్టారు

Pawan Kalyan

Pawan Kalyan

జిల్లాల విభజన.. నామకరణ నేపథ్యంలో కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్ని జిల్లాలకు గతంలోనే పేర్లు పెట్టిన ప్రభుత్వం.. కోనసీమ జిల్లాకు పేరెందుకు పెట్టలేదు..?అన్ని జిల్లాలతో పాటు అదే రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఉంటే ఇవాళ ఈ గొడవే ఉండేది కాదు.జిల్లాలకు మహనీయు పేర్లు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమే.

జిల్లాలకు పేర్లు పెట్టడం అనేది కడపకు వైఎస్ పేరు పెట్టినప్పట్నుంచి మొదలైంది.ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టి.. ఆయన్ను ఓ జిల్లాకు పరిమితం చేసింది.సత్యసాయి జిల్లా మీద అభ్యంతరాలున్నాయనే విషయాన్ని నా దృష్టికి తెస్తే.. స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడాలని సూచించాం.కృష్ణా నది ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్ జిల్లా అని.. నదితక్కువగా ఉన్న ప్రాంతానికి కృష్ణా జిల్లా అని పేరు పెట్టారు.

వంగవీటి రంగా పేరునూ పెట్టాలనే డిమాండ్లు వచ్చాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి అభ్యంతరాలు స్వీకరించడమనే ప్రక్రియని ఎందుకు చేపట్టారు..? అభ్యంతరాలను స్వీకరించడమనే ప్రక్రియతో గొడవలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. కోనసీమ జిల్లాలో కావాలనే చిచ్చు పెట్టారని భావిస్తున్నాం. అభ్యంతరాలు చెప్పడానికి వ్యక్తులుగా రావాలి కానీ.. సమూహంతో రాకూడదని నిబంధన పెట్టడం వెనుకున్న ఉద్దేశ్యం ఏమిటన్నారు పవన్ కళ్యాణ్.

30 రోజులు గడువు ఇచ్చారంటేనే గొడవలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందని అర్ధమవుతోంది. దగ్దమైన మంత్రి పినిపె ఇల్లు సొంతిల్లు కాదు.. అద్దె ఇల్లు. కాకినాడలో ఓ ధర్నా చేసుకుంటామంటే మా జనసేన కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు. కానీ కాకినాడలో ఎందుకు కట్టడి చేయలేకపోయారు..?మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు ఎందుకు రక్షణ కల్పించలేదు..? గొడవలు రెచ్చగొట్టడం వైసీపీకి అలవాటైన విషయమే. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఘటనను పక్కదారి పట్టించడానికి.. కవర్ చేసుకోవడానికే ఈ గొడవలను వైసీపీ పురికొల్పిందని అర్ధమవుతోంది.

ఏపీలో కుల సమీకరణాల మీదే రాజకీయాలు జరిగే ఈ సమయంలో.. గొడవలు జరుగుతాయని తెలిసే వైసీపీ ఈ చిచ్చును రాజేసింది. కడపకు వైఎస్సార్ పేరు పెట్టారు.. తొలి దళిత సీఎం అయిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని రాయలసీమ నుంచి కోరారు. ఆ తర్వాత కొందరు వచ్చి దామోదరం సంజీవయ్య పేరు పెట్టడం ఇష్టం లేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లా పేరు మార్పు విషయంలో రిఫరెండం పెడతామని స్పష్టం చేశాను. అంబేద్కరుని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని విమర్శించారు పవన్.

అంబేద్కర్ స్ఫూర్తిని.. ఆశయాలను వైసీపీ పక్కన పెట్టింది. అంబేద్కరుపై వైసీపీకి నిజంగా ప్రేముంటే గత మూడేళ్లల్లో సబ్ ప్లాన్ నిధులను ఎందుకు సద్వినియోగం చేయడం లేదు..? సబ్ ప్లాన్ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు నిలిపేశారు..? దళితుల అసైన్డ్ భూములను లాగేసుకుంది. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను జగన్ ప్రభుత్వం ఆపేసింది. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఆపేసిందన్నారు పవన్.

Viral News: ఇదేం ఆఫర్ రా బాబూ? ఒక్క వరుడికి ఇద్దరు వధువులా?