Site icon NTV Telugu

Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ మంచి మనసు.. 222 కుటుంబాలకు రగ్గుల పంపిణి!

Rugs Pawan Kalyan

Rugs Pawan Kalyan

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్‌ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. జనాలకు అండగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గిరిజనులపై పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ గ్రామాలను సందర్శించిన జనసేనాని.. అక్కడి వారి బాధలు చూసి పాదరక్షలు పంపించారు. తన తోటలోని ఆర్గానిక్ పండ్లు పంపి మంచి మ‌న‌సు చాటుకున్నారు.

Also Read: Vemireddy Prabhakar Reddy: క్వార్ట్జ్‌ వ్యాపారాన్ని మూసేస్తున్నా.. ఎంపీ వేమిరెడ్డి సంచలన నిర్ణయం!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలో ఏజెన్సీ గ్రామాలైన చిలక మెండంగి, తాడిప్యూట్టి, బెండ మెండింగి, డోయువరా బాగుజోల, సిరివర గ్రామాల్లో 222 కుటుంబాలకు రగ్గులు పంపారు. డిప్యూటీ సీఎం పంపిన రగ్గులను అందుకున్న గిరిజన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

Exit mobile version