Pawan Kalyan : నేడు ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి.. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు
- సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ భేటీ
- అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు (బుధవారం) ఢిల్లీకి బయలుదేరతున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 3.30 గంటలకు ఢిల్లీ విమానానికి ప్రయాణం చేయి, 5:45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయ నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకుని, 6:30 నుంచి 7 గంటల మధ్య ఆయనతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఇటీవల పోలీసు అధికారులపై చేసిన విమర్శల నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Rangareddy Fire Accident: కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
ఇక, పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకోవడం, అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కావడం ఈ రోజు రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపింది. కాగా, మంగళవారం పవన్ కల్యాణ్ తన కార్యకలాపాల భాగంగా సరస్వతి పవర్ ప్రాజెక్ట్ భూములను పరిశీలించారు. ఈ భూముల భూసేకరణపై విచారణ జరిపిస్తామని కూడా ప్రకటించారు. అమిత్ షాతో సమావేశం పూర్తయ్యాక, పవన్ కల్యాణ్ ఢిల్లీని విడిచిపెట్టి ఏపీ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ కొంత సమయం గడిపి, తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి, రాత్రి 10:40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి తిరిగి చేరుకుంటారు.
US Elections Results: అమెరికా అధ్యక్ష ఫలితాలు షురూ.. ట్రంప్ ఖాతాలో 10 రాష్ట్రాలు
తాజావార్తలు
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్‌తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్‌లో సూర్య..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!