Site icon NTV Telugu

Pawan Kalyan : మన శంకర వరప్రసాద్ కు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ విషెష్

Msvg

Msvg

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విజయాలు అందుకున్నారు. తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.

Also Read : Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్టాఫ్ లాక్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసిన రెహమాన్

మెగా అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా మలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, చిరంజీవి సినీ ప్రయాణంలో అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నాలుగు దశాబ్దాలకు పైగా చిరంజీవి గారు ప్రజల హృదయాలకు అత్యంత దగ్గరగా నిలుస్తూ.. అదే తపన, అదే ఉత్సాహంతో తన నటన, హాస్యం, నృత్యాల ద్వారా ప్రేక్షకులను నిరంతరం అలరిస్తున్నారు. ఆయన అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక అభినందనలు. ప్రేక్షకుల హృదయాలకు చేరువయ్యే చిత్రాన్ని అందించిన నిర్మాతలు సాహు గారపాటి, సుష్మితకి కూడా ప్రత్యేక అభినందనలు.ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగమైన నయనతారతో పాటు చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు.” అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది.

 

Exit mobile version