Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వము ప్రకటించిన “చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్” పురస్కారంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ తన సందేశంలో.. “మన దేశ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ కళా దర్శకుల్లో తోట తరణి ముందు వరుసలో ఉంటారు. ఏ కథాంశమైనా సహజత్వం ఉట్టిపడేలా సెట్స్‌ను రూపుదిద్దడం ఆయన ప్రత్యేకతని అన్నారు. సమాజానికి సంబంధించిన కథ కావచ్చు, చారిత్రక గాథ కావచ్చు, లేదా భక్తి చిత్రమైనా.. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి చక్కటి డ్రాయింగ్స్ వేసి సృజనాత్మకంగా సెట్స్ రూపొందిస్తారు అని పేర్కొన్నారు.
Nitish Kumar Reddy: దక్షిణాఫ్రికా సిరీస్‌కి ముందు స్క్వాడ్‌లో మార్పులు.. వైజాగ్ కుర్రాడు అవుట్..!
అలాగే ఆయన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కళా దర్శకత్వం వహించారని గుర్తుచేసుకున్నారు. ఆయన సృజనాత్మకత నుంచి భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. ఇక చివరగా పవన్ కళ్యాణ్ తోట తరణికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.
SSMB29: రాజమౌళి లీక్ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. ‘సంచారి’ సాంగ్ వెనక మైండ్ గేమ్..?
