NTV Telugu Site icon

Pawan Kalyan: అమరావతికి మద్దతిస్తే దాడులు చేస్తారా?

Pawan Kalyan

Pawan Kalyan

రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పై దాడి గర్హనీయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన వై.సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అధికారంలో ఉన్న వైసీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందనే వాస్తవం ఈ దాడితో మరోమారు తేటతెల్లమయింది. ఈ దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలి. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని రాష్ట్ర పాలకులు సందేశం ఇస్తున్నారా?

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన.. హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు, మతమార్పిడిపై నిరసన

ఇదే వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానం అయితే మేము కచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తాం. ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారు’ అని వైసీపీ ఎంపీ ప్రకటించారు అంటూ శ్రీ సత్య కుమార్ గారు చెప్పిన మాటలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ శ్రేణులు చేసిన ఈ దాడి ఘటనను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ముఖ్యమంత్రినీ, ఆయన పార్టీనీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పట్టభద్రులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరస్కరించారు.

క్షోభపడుతున్న రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను, సంఘాలను వైసీపీ ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు వర్గ శత్రువులుగా చూస్తున్నారు. రాష్ట్ర పాలకులు సామాన్య ప్రజలపైనా, ప్రశ్నించిన వారిపైనా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను వేధిస్తూ, వారిపై దాడులకు పాల్పడుతున్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్తాం అన్నారు పవన్ కళ్యాణ్.

Read Also: Minister KTR : మోడీకి ఇష్టం లేకున్నా బెస్ట్ స్టేట్ తెలంగాణ అని చెప్పక తప్పదు