NTV Telugu Site icon

Pawan Kalyan: తోట త్రిమూర్తులు జనసేనలోకి రావట్లేదు.. పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకప్పుడు కొట్టుకున్నారని.. మళ్లీ రాజకీయం గురించి కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు రావులపాలెం టు యానాం ఏటిగట్టు రోడ్డు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈరోజు ఇద్దరూ రాజకీయ అవసరాలకు గురించి కూర్చున్నారన్నారు. తోట త్రిమూర్తులు జనసేనలోకి రావటం లేదని.. అలాంటి సంకేతాలు ఏమీ తన దగ్గరికి రాలేదన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీ నాయకులు మీద వ్యక్తిగత దూషణ లేదని పవన్‌ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ యువతకు, రైతులకు, మహిళలకు, బీసీస ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఒక మాట చెప్పానంటే నిలబడతానన్నారు. ఉదాహరణకు ఇక్కడ నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నాడు.. ద్రాక్షారామంలో భూమి వేలం పాట పెట్టినప్పుడు కాపు కళ్యాణమండపం కడతానని తీసుకుని రెండు దశాబ్దాలు అయిందన్నారు. కులాన్ని ఎలా వాడుకుంటారు అనేదానికి ఇదే ఉదాహరణ అని ఆయన విమర్శించారు. తనను దశాబ్దాల నుండి ఇబ్బందుల పాలు చేశారన్నారు. మండపేటలో సుమారు 50 రైస్ మిల్లులు ఉన్నాయి.. రైతుల్ని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ గంజాయి పంట లాభాల్లో ఉందని విమర్శలు గుప్పించారు. సినిమా టిక్కెట్లు అమ్మడానికి అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి గాని రైతాంగానికి ఏ వ్యవస్థ కలిసి రాదన్నారు.

Read Also: GVL Narasimha Rao: ఏపీలో కూటమి మేనిఫెస్టోకు సహకరిస్తాం.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకే మెజార్టీ స్థానాలు..!

రైతన్నకి ఈ ఐదు సంవత్సరాలలో మద్దతు ధర ఇవ్వలేదని మండిపడ్డారు. 3000 మంది కౌలు రైతులు చనిపోయారని , వారిని జనసేన గుర్తించిందన్నారు. కౌలు రైతులకు కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఓట్లు చీలకూడదు అందరూ కలిసి రావాలి.. వైసీపీ కోటలు బద్దలు కొట్టాలన్నారు. క్రాఫ్ హాలిడే ప్రకటించిన రైతులకు న్యాయం ఏమీ జరగలేదన్నారు. తాతపూడి, కేదార్ లంక, కపిలేశ్వపురం, కొరిమిల్లి నాలుగు ఇసుక రీచ్‌ల నుంచి పది కోట్లు రూపాయలు జగన్‌కు ప్రతినెలా వెళుతుందని ఆరోపించారు. వైయస్ జగన్ సహా సహజ వనరుల మీద ఎవరైనా ఆధిపత్యం చూపిస్తే ఎవరిని వదలనన్నారు. వైయస్ జగన్, తోట త్రిమూర్తులుకు చెప్తున్నాను సహజ వనరులు ఎవరి సొత్తు కాదన్నారు.