మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ సినిమా అనంతరం అందరి మదిలో ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనను, పార్టీని ఆదరించిన ప్రజలకు సేవచేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేశారు.
READ MORE: IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 ఆలౌట్.. గాయంతోనే హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలు అస్సలు ఖాళీ లేను. అప్పుడప్పుడూ గ్యాప్ దొరికినప్పుడే హరిహర వీరమల్లు పూర్తి చేశానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అన్నిసార్లు తాను నటించాల్సిన అవసరం లేదు. సొంతంగా సినిమాలను నిర్మిస్తా. భవిష్యత్‌లో దీనిపైనే ఎక్కువగా దృష్టిపెడతా అని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతగా ఉండటం కాస్త సులువని చెప్పారు. దాదాపు పదేళ్ల కిందటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడంతో చురుగ్గా పని చేయలేదని, దాన్ని వదిలేసినట్లు తెలిపారు. సెప్టెంబరులో ఓజీ విడుదల చేస్తామని.. డిసెంబరు లేదా జనవరి నాటికి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వస్తుందని పవన్ చెప్పారు. ఇక ఐదారు రోజుల పని మిగిలిందని.. అనంతరం సినిమాల నుంచి విముక్తుడిని అవుతాని స్పష్టం చేశారు. సినిమాల కంటే రాజకీయమే ముఖ్యమని.. అందుకే సినిమాలను విదిలేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే అతిథి పాత్రలైనా చేస్తానన్నారు.
