Pawan Kalyan as AP Deputy CM: డిప్యూటీ సీఎంగా పవన్.. ముందే లీక్ చేసిన అమిత్‌షా, చిరంజీవి, అకీరా నందన్..
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటూ ముందే లీక్ చేసిన అమిత్ షా చిరంజీవి అకీరా నందన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan as AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా.. ఇతర మంత్రులు… సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తుండగా.. మరోవైపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటూ ముందే లీక్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ”ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు అమిత్‌షా.. అంటే.. తన ట్వీట్‌లో పవన్ కల్యాణ్‌ను ఏపీ డిప్యూటీ సీఎంగా పేర్కొన్నారు అమిత్‌షా.. కాగా, ఏపీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందే విజయవాడ చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా.. టీడీపీ అధినేతతో కీలక సమావేశం నిర్వహించారు.. మంత్రులు, వారికి శాఖల కేటాయింపుపై చర్చ సాగింది.. ఆ తర్వాతే.. మంత్రుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన విషయం విదితమే.
Read Also: Cholera: మధ్యప్రదేశ్‌లో కలరా కలకలం.. ఇద్దరు మృతి, 80 మందికి అస్వస్థత
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ముందుగానే పేర్కొన్నారు.. ”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను….ఆశిస్తున్నాను.!!” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, మెగాస్టార్ చిరంజీవి కంటే ముందే ఈ విషయాన్ని బయట పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్.. “Honourable Deputy Chief Minister Of Andhra Pradesh Shri Pawan Kalyan Garu” అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు అకీరా నందన్.. దీంతో.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అనేది స్పష్టమైనా.. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Congratulations to Andhra Pradesh Chief Minister Shri @ncbn Ji, Deputy Chief Minister Shri @PawanKalyan Ji, and all others who took the oath of office today. It is my firm belief that the NDA government will pivot the state of Andhra Pradesh to new heights of prosperity,… pic.twitter.com/r4yJKJa6rY
— Amit Shah (@AmitShah) June 12, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..