NTV Telugu Site icon

Pawan Kalyan as AP Deputy CM: డిప్యూటీ సీఎంగా పవన్‌.. ముందే లీక్‌ చేసిన అమిత్‌షా, చిరంజీవి, అకీరా నందన్‌..

Pawan

Pawan

Pawan Kalyan as AP Deputy CM: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్‌ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా.. ఇతర మంత్రులు… సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తుండగా.. మరోవైపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అంటూ ముందే లీక్‌ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ”ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.” అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు అమిత్‌షా.. అంటే.. తన ట్వీట్‌లో పవన్‌ కల్యాణ్‌ను ఏపీ డిప్యూటీ సీఎంగా పేర్కొన్నారు అమిత్‌షా.. కాగా, ఏపీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందే విజయవాడ చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డా.. టీడీపీ అధినేతతో కీలక సమావేశం నిర్వహించారు.. మంత్రులు, వారికి శాఖల కేటాయింపుపై చర్చ సాగింది.. ఆ తర్వాతే.. మంత్రుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిలీజ్‌ చేసిన విషయం విదితమే.

Read Also: Cholera: మధ్యప్రదేశ్‌లో కలరా కలకలం.. ఇద్దరు మృతి, 80 మందికి అస్వస్థత

మరోవైపు.. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ముందుగానే పేర్కొన్నారు.. ”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను….ఆశిస్తున్నాను.!!” అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, మెగాస్టార్‌ చిరంజీవి కంటే ముందే ఈ విషయాన్ని బయట పెట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌.. “Honourable Deputy Chief Minister Of Andhra Pradesh Shri Pawan Kalyan Garu” అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు అకీరా నందన్‌.. దీంతో.. పవన్‌ కల్యాణ్ డిప్యూటీ సీఎం అనేది స్పష్టమైనా.. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.