టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ అనుమతి లేకుండా పేర్లు, ఫోటోలు వాడటాన్ని నిలువరించాలని కోరుతూ ఈ ఇద్దరు హీరోలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ పేరు, ప్రతిష్ఠను వాణిజ్య ప్రయోజనాల కోసం అనధికారికంగా ఉపయోగించడం చట్టవిరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకటనలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో అనుమతి లేకుండా ఫోటోలు, పేర్లు వాడటాన్ని తక్షణమే ఆపాలని వారు కోర్టును కోరారు.
Also Read : BMW : భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడా..?
ఈ పిటిషన్ కు సంబంధించిన కీలక న్యాయ వ్యవహారం నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులు, ఇమేజ్ రైట్స్‌కు సంబంధించి ఈ కేసు కీలకమైన తీర్పుకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విచారణ ఫలితం భవిష్యత్తులో ఇతర సినీ ప్రముఖులకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. నేటి విచారణ అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది వేచి చూడాల్సిందే. ఈ పిటిషన్లపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుండటంతో సినీ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
