NTV Telugu Site icon

Pawan Kalyan: ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు.. ముగ్గురికి ఒకే చోట పేషీలు ఇవ్వాలని కోరిన జనసేన

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు. సెక్రటేరియట్‌లో పవన్‌ కల్యాణ్‌కు సెకండ్ బ్లాక్ 212 రూం కేటాయించినట్టు సమాచారం. పవన్ ఛాంబర్, పేషీ, వ్యక్తిగత సిబ్బంది కోసం మూడు రూంలు కేటాయించినట్లు తెలిసింది.

Read Also: Minister Satyakumar: రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సత్యకుమార్

పవన్‌కు కేటాయించే అవకాశం ఉన్న పేషీలో అందుబాటులో రెండు యాంటీ రూంలు ఉన్నట్లు సమాచారం. పవన్ పేషీలో ఓ మీటింగ్ హాల్, ఓ ప్యాంట్రీ ఉండనుంది. అధికారిక సమీక్షలకు.. సమావేశాలకు అనువుగా పవన్ పేషీ ఉండనుంది. పవన్ కల్యాణ్ పేషీ పక్కనే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పేషీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.తమ ముగ్గురికి ఒకే చోట పేషీలు ఇవ్వాలని జీఏడీని జనసేన కోరింది.