పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టడం జరిగింది. జులై 4వ తేదీన ఎలుగెత్తు, ఎదిరించు ,ఎన్నుకో.. జైహింద్ అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ ను ఖాతాను తెరిచారు..ఇలా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సెకన్స్ లోనే విపరీతంగా ఫాలోవర్స్ తో నిండిపోయింది.దీంతో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సృష్టించారు.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరడం జరిగింది. కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే ఇంత భారీ స్థాయిలో ఫాలోవర్స్ రావడం మామూలు విషయం కాదు.పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో మొదటిసారిగా ఇలాంటి రికార్డు సృష్టించడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. అలాగే పవర్ స్టార్ ఇంస్టాగ్రామ్ లో మొదట ఎలాంటి పోస్ట్ ను షేర్ చేస్తారో అంటూ ఫాలోవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ను ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ తన మొదటి పోస్ట్ ను షేర్ చేస్తే పవన్ కళ్యాణ్ కు మరింత ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోయిన్ లు కూడా కూడా ఇంస్టాగ్రామ్ లో లో పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. వారిలో శృతిహాసన్ మరియు కీర్తి సురేష్ హీరోయిన్స్ వంటి స్టార్ హీరోయిన్ లు కూడా వున్నారు. ప్రస్తుతం వారాహి యాత్రలో ఎంతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్..అలాగే ఆయన సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఈనెల 28న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్ మరియు సాంగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.మరీ బ్రో సినిమాతో పవన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి..