Site icon NTV Telugu

Pavel Durov: భవిష్యత్‌పై టెక్ దిగ్గజాల సూచన.. వైరల్ పోస్ట్..!

Pavel Durov

Pavel Durov

Pavel Durov: గణితశాస్త్రం అంటే కేవలం గణాంకాలు కాదు, అది విజ్ఞానాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించే శక్తిమంతమైన సాధనమని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ (Pavel Durov) వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఏ విషయంపై దృష్టిపెట్టాలో చర్చ జరుగుతున్న వేళ.. దురోవ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే, ఈ విషయంపై ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) మాత్రం ఆయన అభిప్రాయాన్ని కొంత విభిన్నంగా చూశారు. మరి ఆ విశేషాలేంటో ఓసారి చూద్దామా..

టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ సోషల్ మీడియా వేదికగా.. మీరు ఏ విషయంలో దృష్టి పెట్టాలనుకుంటున్నారో ఆలోచిస్తున్న విద్యార్థులైతే, గణితం నేర్చుకోండి. ఇది మిమ్మల్ని మీ మెదడుపై ఆధారపడేలా చేస్తుంది. లాజిక్‌తో ఆలోచించడాన్ని, సమస్యలను విడమరచి సరైన క్రమంలో పరిష్కరించడం నేర్పిస్తుంది. కంపెనీలు స్థాపించడానికైనా, ప్రాజెక్టులను నడపడానికైనా ఇది ముఖ్యమైన నైపుణ్యం అని ఆయన పేర్కొన్నారు.

HCA Scam: తీగ లాగితే.. డొంక కదులుతోంది! HCA అక్రమార్కుల భరతం పడుతున్న సీఐడీ..!

మరోవైపు డురోవ్ అభిప్రాయంతో అంగీకరిస్తూనే, ఎలాన్ మస్క్ మాత్రం భౌతిక శాస్త్రం కూడా తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఫిజిక్స్‌తో పాటు గణితం ఉంటే, అది వాస్తవ ప్రపంచంలో మీరు గణితాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఇద్దరూ గణిత శాస్త్రం కీలకం అన్న అభిప్రాయాన్ని పంచుకుంటున్నా, దాని అన్వయాన్ని కూడా ప్రాధాన్యంగా చూడాలని మస్క్ అభిప్రాయపడ్డారు.

Work From Home: తండ్రి మరణం.. ఉద్యోగి బాధను లైట్‌ తీసుకున్న కంపెనీ.. చివరకు..?

డురోవ్ తన పోస్టులో ఇంకొక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. గణితంలో మీరు బలంగా ఉంటే, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి వాటిని అన్వయించటం మంచిదని చెప్పారు. ఈ రెండూ గణితాన్ని వాస్తవ ప్రపంచంలో ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాయి. దీనివల్ల మీ లాజికల్, క్రిటికల్ థింకింగ్ మెరుగవుతుంది. అంతేగాక, ప్రాధాన్యత ఉన్న సమస్యల పరిష్కారంలో మీరు భాగస్వాములవుతారని వివరించారు. ఈ చర్చపై సామాజిక మాధ్యమాల్లో భిన్నరకాల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version