NTV Telugu Site icon

Pawan Kalyan: జగన్‌ను ఇబ్బంది పెట్టాల్సిన పనే లేదు.. పవన్ కళ్యాణ్..

Pavan

Pavan

ఏపీలో వైస్సార్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. జనసేన పార్టీ 21 స్థానాలు నుంచి పోటీ చేసి 21 స్థానాల్లోనూ గెలవగా.. టీడీపీ 134 కంటే ఎక్కువ సీట్లు నుంచి గెలిచింది. బీజేపీ దగ్గర దగ్గరగా వైసీపీతో సమానంగా సీట్లను గెలుచుకుంది. ఈ ఓటమితో సీఎం జగన్ మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత తాజాగా పవన్ కళ్యాణ్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేడు ఒక చారిత్రాత్మక రోజని ఆయన వెల్లడించారు. ఏదైతే చెప్పే అధికారంలోకి వచ్చామో అదేం కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. ముఖ్యంగా ఓ జవాబుదారు ప్రభుత్వంగా పనిచేస్తామని, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాధులు వేయడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

CPI Narayana: రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ఫలితాలపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

ఇక ఈ మాటల్లో ఆయన వైయస్ జగన్ నాకు వ్యక్తిగత శత్రువులు కాదు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదని, వైస్సార్సీపీ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ఈ ఘనవిజయంతో ఏపీ ప్రజలకు మంచి చేయడానికి కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ చాలా హుందాగా మాట్లాడాడు. జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరు కూడా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని ఆయన ఈ సందర్భంగా మాట్లాడగా ఆయన మాటలకు చాలామంది చప్పట్లు కొట్టారు.

Yusuf Pathan: ఆన్ ఫీల్డే కాదు ఆఫ్ ఫీల్డ్ లో కూడా విజయం సాధించిన టీమిండియా ఆటగాడు..

ఆంధ్రాలో ప్రతి ఊర్లో ఉండే మనిషి కష్టాన్ని నేను స్వయంగా చూశాను. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు గెలిచాక కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది. నాకు పరువు ఇచ్చారు. మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బాగా నిలబడ్డవాడిని.. ఇంత గెలుపు ఇచ్చారు ఆకాశమంత ఉత్సాహం ఇచ్చారు. ఇప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను. నిలబెడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ కంట్లో ఒకటిలా నేను ఉంటానని మాట ఇస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడని., నాకు కులాలకు, మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఒక్కడు అనుకోవాల్సిందే అని అలాగే మావాడు అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడు. మా కష్టాల కోసం నిలబడుతున్నాడు.. అది నేను చేసి చూపిస్తాను., ప్రభుత్వం ఎలా ఉండాలి అధికార యంత్రం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకందరికీ చేసి చూపిస్తాం అంటూ తెలిపాడు.