CM YS Jagan: ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని.. తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తనను కలిసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కర్నూలు జిల్లా పత్తికొండ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా వైసీపీ నేతలు.. సుమారు గంటన్నరకు పైగా నేతలు, కార్యకర్తలతో గడిపారు సీఎం జగన్.. పలువురు పార్టీ నేతలను, సీనియర్ కార్యకర్తలను పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేయాలన్నదానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Read Also: 2000 Notes Exchange: రూ.2000 నోట్ల డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ..!
మరోవైపు.. స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పలువురు నేతలు చేరారు.. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో.. వైసీపీలో చేరారు పలువురు నేతలు.. ఇక, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గుత్తి వద్ద ప్రజల సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ఉమామహేశ్వర నాయుడు.. కాగా, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. నాల్గో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్న విషయం విదితమే.