NTV Telugu Site icon

Prashant Kishor : గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్న ప్రశాంత్ కిషోర్

Haryana Crime News (7)

Haryana Crime News (7)

Prashant Kishor : త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ ప్రారంభ తేదీని ప్రకటించారు. మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న తన పార్టీని ప్రారంభిస్తానని పీకే స్పష్టం చేశారు. బీహార్ అంతటా రెండు సంవత్సరాల రాజకీయ ప్రయాణం తరువాత, అతను ఇప్పుడు తన సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టనున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు 21 మంది నేతలతో కమిటీని కూడా ఏర్పాటు చేస్తానని కిషోర్ తెలిపారు.

Read Also:G. Kishan Reddy: నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను..

2021లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు ఘనవిజయం అందించిన ప్రశాంత్ కిషోర్ ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. 2 అక్టోబర్ 2022న అధికారికంగా రాజకీయాల్లోకి రావడానికి ముందు బీహార్ అంతటా యాత్ర చేస్తానని కూడా ప్రకటించాడు. పీకేగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్‌ని స్థాపించారు. పశ్చిమ చంపారన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 5000 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 జిల్లాలను కాలినడకన, 10 జిల్లాలను కారులో పర్యటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని మొత్తం 243 స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించారు. ముస్లిం, అట్టడుగు వర్గాల ఓటర్లు కులం, మతం ప్రాతిపదికన ఓటు వేయవద్దని, తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also:Karimnagar: ఒక వైపు బర్త్ డే విషెస్ పోస్ట్ వైరల్.. మరోవైపు ఫ్లెక్సీల వార్..

బీహార్‌లో సామాజిక న్యాయ రాజకీయాలు 1990ల నుంచి ప్రారంభమయ్యాయి. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, ప్రస్తుత బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ రాజకీయాలకు నేతృత్వం వహించారు. జేడీయూతో ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించడం గమనార్హం. 2015లో నితీష్‌ కుమార్‌ ఆయనకు పార్టీలో నంబర్‌ టూ స్థానం కల్పించినా, త్వరలోనే ఇద్దరూ విడిపోయారు. ప్రశాంత్ కిషోర్ ముస్లిం ఓట్లపై నిఘా ఉంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆయన ప్రకటించారు.