NTV Telugu Site icon

Patna crime: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యం.. రణరంగంగా పాట్నా

Patna

Patna

అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి ఓ ప్రైవేటు పాఠశాలలో శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు, ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. నిరసనలు, ఆందోళనలతో బీహార్‌లోని పాట్నా రణరంగంగా మారింది.

పాట్నాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడేళ్ల చిన్నారి డ్రైనేజీలో శవమై కనిపించింది. తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి వాకబు చేసినా స్కూల్ యాజమాన్యం నుంచి మాత్రం సరైన జవాబు దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు యాజమాన్యంతో గొడవకు దిగారు. కానీ వారి నుంచి సరైన ఆన్సర్ మాత్రం లభించలేదు. అనంతరం స్కూల్ ఆవరణను మొత్తం వెతికితే డ్రైనేజీలో మృతదేహం కనిపించింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పెద్ద ఎత్తున స్కూల్‌కు చేరి పాఠశాలకు నిప్పుపెట్టారు.

ఇది కూడా చదవండి: Shocking incident: ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు.. స్కూల్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో చిన్నారి స్కూల్ లోపలికి వెళ్లిన దృశ్యాలు ఉన్నాయి గానీ.. బయటకు వెళ్లిన దృశ్యాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో స్కూల్‌లోనే ఏదో జరిగిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాట్నా పోలీస్ సూపరింటెండెంట్ చంద్రప్రకాశ్ తెలిపారు. తరగతి గది లోపల డ్రెయిన్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని.. హత్య కేసుగానే చూస్తు్న్నట్లు వెల్లడించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. విచారణ కొనసాగుతుందని చంద్రప్రకాశ్ మీడియాకు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్కూల్ నుంచి చిన్నారి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. దీంతో విద్యాసంస్థకు వచ్చి వాకబు చేస్తే సరైన జవాబు దొరకలేదు. దీంతో అనుమానాలు తలెత్తాయి. బంధువలతో కలిసి వెతుకులాట ప్రారంభించగా.. స్కూల్ డ్రైనేజీలో మృతదేహం లభ్యమైంది. అసలు చిన్నారి ఎందుకు శవమైంది? స్కూల్ యాజమాన్యం ఎందుకు సరిగ్గా స్పందించలేదు. బాధ్యతగా స్కూల్ యాజమాన్యం ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు. అసలేం జరిగింది. ఇప్పుడు ఈ మిస్టరీ వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.